Domino’s Pizza: శాకాహారికి నాన్‌వెజ్ పిజ్జా డెలివరీ చేసిన డామినోజ్.. రూ. 9.6 లక్షలు ఫైన్ విధించిన కోర్టు

తను వెజిటేబుల్ పిజ్జా ఆర్డర్ చేస్తే.. పొరపాటున నాన్-వెజ్ పిజ్జా డెలివరీ అయింది. పిజ్జా వాసనకు ఆ వ్యక్తి వెంటనే వాంతులు చేసుకున్నాడు. తన మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆ వ్యక్తి వినియోగదారుల కోర్టుని ఆశ్రయించాడు.

Domino's Pizza: శాకాహారికి నాన్‌వెజ్ పిజ్జా డెలివరీ చేసిన డామినోజ్.. రూ. 9.6 లక్షలు ఫైన్ విధించిన కోర్టు
Dominos Pizza
Follow us

|

Updated on: May 14, 2022 | 3:04 PM

Domino’s Pizza: కొంతమందికి నాన్ అంటే ప్రాణం.. ముక్కలేనిదే ముద్ద దిగదు అనేవారు కూడా ఉన్నారు. మరికొందరు.. మాంసాహారం (Non-vegetarian) వాసన వస్తే చాలు.. ఆమడ దూరం పరిగెడతారు.. మరి లాంటి సంపూర్ణ శాఖా హర వ్యక్తి.. మాంసంహారం ఉన్న ఆహారపదార్ధాలను డెలివరీ ఇస్తే.. ఎలా స్పందిస్తాడో ఊహించడానికి కూడా కష్టమే కదా.. ఆకలి మీద ఉంటే.. మాంసాహారం ఉన్న ప్లేట్ ను విసిరికొట్టిన ఆశ్చర్యం లేదు.. ఇలాంటి సందర్భమే ఒక వ్యక్తికీ ఎదురైంది. శాకాహారం తినే వ్యక్తికి మాంసాహారం ఉన్న పిజ్జాను డెలివరీ చేశారు. అసలు నాన్‌వెజ్ స్మెల్ పీల్చుకునేందుకే ఇష్టపడని ఓ వ్యక్తికి అలాంటి పరిస్థితే ఎదురైంది. తను వెజిటేబుల్ పిజ్జా ఆర్డర్ చేస్తే.. పొరపాటున నాన్-వెజ్ పిజ్జా డెలివరీ అయింది. పిజ్జా వాసనకు ఆ వ్యక్తి వెంటనే వాంతులు చేసుకున్నాడు. తన మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆ వ్యక్తి వినియోగదారుల కోర్టుని ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో (Uttarakhand)2020లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరాఖండ్‌, రూర్కీకి చెందిన శివంగ్ మిట్టల్ సహా అతని ఫ్యామిలీ మొత్తం శాఖాహారులే. ఒకరోజు రూ.918 చెల్లించి డొమినోస్‌లో వెజిటేబుల్ పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే డెలివరీ అయిన ఆ పిజ్జా స్మెల్ డిఫరెంట్‌గా ఉండటంతో అనుమానం కొద్దీ ఓపెన్ చేశాడు. అది నాన్‌వెజ్ పిజ్జా కావడంతో వాసనకే వాంతులు చేసుకున్నాడు. ఈ సంఘటన అక్టోబర్ 26, 2020న జరిగింది. వెంటనే శివంగ్ పోలీసులను ఆశ్రయించాడు. వారు పట్టించుకోకపోవడంతో.. 2021లో వినియోగదారుల ఫోరమ్ ని ఆశ్రయించాడు. తాను డొమినోస్ నిర్లక్ష్యం కారణంగా శారీరకంగా, మానసికంగానే కాదు.. ఆర్ధికంగా కూడా నష్టపోయినట్లు కోర్టుని విన్నవించాడు.

జిల్లా వినియోగదారుల ఫోరమ్ చీఫ్ కన్వర్ సేన్, సభ్యులు అంజనా చద్దా, విపిన్ కుమార్ లు ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. డొమినోస్ నిర్లక్ష్యంగా వ్యవరించినట్లు గుర్తించారు. దీంతో శివాంగ్ చెల్లించిన రూ.918 కు 6 శాతం వడ్డీ చొప్పున రూ.4.65 లక్షలతో పాటు ప్రత్యేక జరిమానాగా రూ. 5 లక్షలు చెల్లించాలని డొమినోస్‌ను ఆదేశించింది. మొత్తానికి రూర్కీలోని వినియోగదారుల కోర్టు డోమినోస్‌పై రూ.9,65,981 జరిమానా విధించింది. అంతేకాదు డొమినోస్ కంపెనీ చర్య ఆ వ్యక్తి మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..