Ambati Rayudu: మరో ట్విస్ట్ ఇచ్చిన అంబటి రాయుడు.. రిటైర్మెంట్ ట్వీట్ డిలీట్.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈవో..
IPL 2022: రాయుడు అసలు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం గాక.. క్రికెట్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఆవెంటనే సీఎస్కే సీఈవో విశ్వనాథ్ రాయుడు రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు. 'నేను రాయుడితో మాట్లాడాను. అను రిటైర్ అవ్వట్లేదు.
IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు (Ambati Rayudu) మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ఈరోజు మధ్యాహ్నం ట్వీట్ చేసిన ఈ ఆంధ్రా ఆటగాడు కొద్ది సేపటికే దాన్ని తొలగించాడు. దీంతో రాయుడు అసలు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం గాక.. క్రికెట్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఆవెంటనే సీఎస్కే సీఈవో విశ్వనాథ్ రాయుడు రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు. ‘నేను రాయుడితో మాట్లాడాను. అను రిటైర్ అవ్వట్లేదు. ఈ సీజన్‌లో అతడు తన ఆటతీరుతో కొంచెం అసంతృప్తిగా ఉన్నాడు. అందువల్లే పొరబాటుగా ఆ ట్వీట్ చేసి ఉంటాడు. కానీ ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు. ఈ సీజనే కాదు వచ్చే సీజన్‌లోనూ అతను చెన్నై జట్టుతోనే కొనసాగుతాడు’ అని మీడియాకు వెల్లడించారు విశ్వనాథ్.
గతంలోనూ అంతే..
కాగా రాయుడు ఇలా చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2019లో ప్రపంచకప్ జట్టుకు రాయుడును ఎంపిక చేయకపోవడంతో అతను అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఫ్రాంఛైజీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ వెనక్కు తీసుకున్నాడు. కాగా 36 ఏళ్ల ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 27.10 సగటున కేవలం 271 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో చెన్నై తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (313), శివమ్ దూబే (289) మాత్రమే అంబటి రాయుడు కంటే కూడా ముందున్నారు. ఈ లెక్కన రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడానికి సీఈవో చెప్పినట్లు అతడి ఫామ్ అయితే కారణం కాదు. మరేదో కారణముందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: