AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌రెడ్డి ఫ్యామిలీ ఎపిసోడ్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్

పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్ రెడ్డిపై గృహహింస కేసు నమోదైంది. శుక్రవారం సాయంత్రం పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.

Hyderabad: పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌రెడ్డి ఫ్యామిలీ ఎపిసోడ్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్
Husband Harassed Wife
Ram Naramaneni
|

Updated on: May 15, 2022 | 12:36 PM

Share

ఆ స్వీట్‌షాపుకెళితే మిఠాయిల వాసన ఘుమఘుమలాడుతుంది. స్వచ్చమైన నేతితో చేసిన పదార్థాలు నోరూరిస్తాయి. కొన్ని దశాబ్దాలుగా పుల్లారెడ్డి స్వీట్‌షాపుకు ఉన్న గుడ్‌విల్‌ అది. పుల్లారెడ్డి స్వీట్స్‌ వ్యవస్థాపకుడు జి పుల్లారెడ్డి నేమ్‌కి ఇప్పటి వరకు డామేజీ జరగలేదు. ఆయన మనవడు మాత్రం పుల్లారెడ్డికి చెడ్డపేరు తీసుకొచ్చేలా ఉన్నాడు. పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌రెడ్డి ఫ్యామిలీ ఎపిసోడ్‌లో కొత్త విషయాలు బైటికొస్తున్నాయి. భార్యను ఇంట్లో వుంచి బైటికి రాకుండా అడ్డుగా గోడకట్టిన ఏక్‌నాథ్‌.. తాజాగా వార్తల్లోకి వచ్చాడు. ఈ భార్యాభర్తల మధ్య గొడవకు కారణాలేంటని ఆరా తీస్తే ఆసక్తికరమైన డీటెయిల్స్ బైటికొస్తున్నాయి. 2016లో బెంగుళూరు(Bengaluru)కు చెందిన ప్రజ్ఞారెడ్డిని పెళ్లి చేసుకున్నారు ఏక్‌నాథ్‌రెడ్డి. అప్పటికే బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏక్‌నాథ్‌రెడ్డి.. ఆ విషయాన్ని పెళ్లి సమయంలో దాచి పెట్టారు. ఇక్కడే భార్యాభర్తల మధ్య డిఫరెన్సెస్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏడు సంవత్సరాల తన బిడ్డకు ఆస్తి రాసివ్వాలని భర్తతో పేచీకి దిగారు ప్రజ్ఞారెడ్డి. కానీ ఆస్తి ఇవ్వడానికి నిరాకరించి… భార్యా బిడ్డల్నే వదిలించుకోవాలని డిసైడై విడాకులకు అప్లయ్ చేశారు ఏక్‌నాథ్‌రెడ్డి. ఆస్తిలో భాగమిస్తేనే విడాకులంటూ కండిషన్ పెట్టడంతో భార్యతో ఘర్షణకు దిగాడు ఏక్‌నాథ్‌రెడ్డి. భార్య మరీ మొరాయించడం, బెంగుళూరు నుంచి ఆమె బంధువులు రావడంతో శుక్రవారం ఇంట్లో గోడ కట్టి పారిపోయాడు.

ఏక్‌నాథ్‌రెడ్డితో పాటు అతడి తల్లిదండ్రులు కూడా ఈ ఘాతుకంలో భాగస్వాములే అంటున్నారు ప్రజ్ఞారెడ్డి తండ్రి. ఆమెకు ప్రాణాపాయం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఇలా గోడ కట్టారని, ఏక్‌నాథ్‌ తల్లి భారతీరెడ్డి కూడా తన కూతుర్ని వేధించారన్నది ప్రజ్ఞారెడ్డి తండ్రి ఆవేదన. కొడుకు చేత… విడాకుల పిటిషన్ వేయించి… వాళ్ల కాపురంలో ఆమే నిప్పులు పోశారంటున్నారు ప్రజ్ఞారెడ్డి తండ్రి. ఏక్‌నాథ్ రెడ్డి తల్లిదండ్రుల వెర్షన్ తెలియాల్సి వుంది. అటు… ఏక్‌నాథ్‌ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ అనే కొత్త విషయం… ఈ వివాదంలో కీలకంగా మారింది. అతడి వైపు సెంటిమెంట్‌ని డ్రైవ్ చేస్తోంది. భార్యాభర్తల మధ్య ఈ గోడ వివాదం…ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

Follow Us
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..