AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కుక్క కడుపులో 5.2 కిలోల కణితి.. రెండు గంటల పాటు శ్రమించి తొలగించిన వైద్యులు!

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఎనిమిదేళ్ల గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతి శునకం కడుపులో పెరిగిన 5.2 కిలోల భారీ ప్లీహ గ్రంథి కణితిని సుమారు రెండు గంటల పాటు శ్రమించి విజయవంతంగా తొలగించారు.

Hyderabad: కుక్క కడుపులో 5.2 కిలోల కణితి.. రెండు గంటల పాటు శ్రమించి తొలగించిన వైద్యులు!
Rare Veterinary Surgery
Ram Naramaneni
|

Updated on: Nov 21, 2026 | 9:05 AM

Share

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ శునకానికి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాపాయం నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. ఏకంగా 5.2 కిలోల బరువున్న భారీ కణితిని దాని కడుపు నుంచి విజయవంతంగా తొలగించారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తి చేశారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయానికి చెందిన పశువైద్య కళాశాలలో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది.

ఎనిమిదేళ్ల వయసున్న గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతి శునకం కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో దాని యజమాని చికిత్స కోసం పశువైద్య కళాశాలకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన నిపుణులు.. శునకం కడుపులో భారీ ప్లీహ గ్రంథి కణితి ఉన్నట్లు గుర్తించారు. దాని పరిమాణం, బరువు దృష్ట్యా శస్త్రచికిత్స సవాలుగా మారింది.

ఈ నేపథ్యంలో రేడియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రాధాకృష్ణరావు ఆధ్వర్యంలో పీహెచ్‌డీ పరిశోధకులు, పీజీ విద్యార్థులతో కూడిన వైద్య బృందం ఆపరేషన్‌కు సిద్ధమైంది. సుమారు రెండు గంటల పాటు శ్రమించి 5.2 కిలోల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించింది.

శునకాల్లో ఇంత భారీ ప్లీహ గ్రంథి కణితిని తొలగించే శస్త్రచికిత్స అత్యంత అరుదైనదని ప్రొఫెసర్‌ రాధాకృష్ణరావు తెలిపారు. పశువైద్య రంగంలో ఈ తరహా క్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించడం వైద్య కళాశాల నిపుణుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

Follow Us