KSI Crypto: కోట్లు పోగొట్టుకున్న యూట్యూబర్.. పెట్టుబడిని ఆవిరి చేసిన ఆ క్రిప్టో కాయిన్.. జ్ఞానోదయమైందంటూ..

KSI Crypto: కోట్లు పోగొట్టుకున్న యూట్యూబర్.. పెట్టుబడిని ఆవిరి చేసిన ఆ క్రిప్టో కాయిన్.. జ్ఞానోదయమైందంటూ..
Youtuber Ksi

KSI Crypto: గత కొన్ని రోజులుగా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టిన వారికి కంటి మీద కునుకు కరువైంది. లక్షలు, కోట్లు ఉండాల్సిన వారి పెట్టుబడి అమాంతం వేలల్లోకి కరిగిపోతోంది. తాజాగా..

Ayyappa Mamidi

|

May 15, 2022 | 3:33 PM

KSI Crypto: గత కొన్ని రోజులుగా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టిన వారికి కంటి మీద కునుకు కరువైంది. లక్షలు, కోట్లు ఉండాల్సిన వారి పెట్టుబడి అమాంతం వేలల్లోకి కరిగిపోతోంది. తాజాగా.. క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్రాష్ తో ప్రముఖ యూట్యూబర్ కేఎస్ఐ సుమారు రూ.26.61 కోట్లను కోల్పోయాడు. లునా కాయిన్ విలువ సున్నాకు చేరిన సంగతి తెలిసిందే. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 100 శాతం విలువను కోల్పోయింది. ఈ లునా కరెన్సీలో యూట్యూబర్ కేఎస్ఐ 2.8 మిలియన్ పౌండ్ల ఇన్వెస్ట్ చేశారు. గురువారం ఈ మార్కెట్ క్రాష్ తర్వాత కేఎస్ఐ ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో డబ్బు కంటే ముఖ్యమైన విషయాలు చాలానే ఉన్నాయని ఇటీవలే తాను తెలుసుకున్నట్లు తెలిపాడు. తాను తీసుకున్న థెరపీ వల్లే ఇదంతా తెలిసిందని అన్నాడు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నానని తన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు డబ్బే సర్వస్వమని తాను భావించే వాడినని.. కానీ అదే జీవితం కాదని తాను తెలుసుకున్నట్లు అందులో వివరించాడు. కేఎస్ఐ అసలు పేరు జేజే ఓలాతుంజీ.

గతేడాది తాను ఓ వ్యక్తి దగ్గరకు థెరపీకి వెళ్లాలని, ఆ థెరపీ తర్వాత తాను చాలా ప్రశాంతంగా ఉన్నట్టు తెలిపారు. తాను లునా కరెన్సీని 2.8 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేశాడు. వీటి  విలువ ఇప్పుడు 50 వేల కంటే తక్కువకి పడిపోయింది. కానీ నేను ఓకే . ఎందుకంటే నేను చనిపోలేదు కదా.. నాకు మా ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, పని విషయంలో నీతి నియమాలను పాటిస్తున్నాను అంటూ కేఎస్ఐ ట్వీట్ చేశారు. స్థిరమైన కాయిన్ టెర్రాయూఎస్‌డీ సిస్టర్ కాయిన్ లునా ఈ మధ్య భారీగా నష్టపోయింది. శుక్రవారం దీని వాల్యూ జీరో డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్‌లో ఈ కరెన్సీ వాల్యూ 110 డాలర్లకు పైన ట్రేడ్ అయింది.

ఇతర క్రిప్టో కరెన్సీల వాల్యూలు కూడా భారీగానే ఆవిరయ్యాయి. బిట్ కాయిన్ వాల్యూ 30 వేల డాలర్ల కిందకి పడిపోయింది. టెర్రాయూఎస్‌డీ కూడా కుప్పకూలింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 1.33 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. ఇథెరియం కూడా పడిపోతూనే ఉంది. రెండో అతిపెద్ద కరెన్సీ అయిన ఈ కరెన్సీ వాల్యూ 1.2 శాతం తగ్గి 2030 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో డోజ్ కాయిన్ వాల్యూ 2.7 శాతం నష్టంలో 0.088207 డాలర్ల వద్ద ఉంది. షిబా ఇను కూడా భారీగా పతనమైంది. ఈ కరెన్సీ వాల్యూ గత 24 గంటల్లో 0.000001212 డాలర్లకు పడిపోయింది. గత రెండేళ్లలో బిట్ కాయిన్ వాల్యూ ఈ మేర పడిపోవడం ఇదే తొలిసారని తెలుస్తోంది. ఏదేమైనా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి చాలా ఒడిదొడుకులతో కూడుకున్నది. వీటితో డీల్ చేయటం అంత సులువు కాదని ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అర్థమౌతోంది. అత్యాసకు పోయి తక్కువ కాలంలో సంపాదించాలనుకునేవారు చాలా మందే నష్టపోయారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Thomas Cup 2022: చరిత్ర సృష్టించిన కిదాంబీ శ్రీకాంత్.. తొలిసారి థామస్‌ కప్‌ చేజిక్కించుకున్న భారత్‌..

Lunar Eclipse 2022: రేపు చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu