Cyber Fraud: PNB కస్టమర్లకు అలర్ట్.. ఆన్‌లైన్ మోసం జరిగితే వెంటనే ఈ నంబర్‌కు కాల్ చేయండి
Cyber Fraud: సైబర్ నేరాల విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) ఖాతాదారులను అలర్ట్ చేసింది. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది...
Cyber Fraud: సైబర్ నేరాల విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) ఖాతాదారులను అలర్ట్ చేసింది. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత కొన్ని సంవత్సరాలలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇతర ఆన్‌లైన్ సేవలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజుల్లో ప్రజలు షాపింగ్ నుండి మందుల కొనుగోళ్ల వరకు ప్రతీది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్ చెల్లింపులను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి వచ్చాక సేవలు సులభతరం అయ్యాయి.
పెరుగుతున్న సైబర్ నేరాల కేసులు:
ఇంటర్నెట్ వాడకంతో పాటు ఆన్‌లైన్ మోసాల సంఘటనలు కూడా పెరిగాయి. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రకరకాల దారులను వెతుక్కుంటూ ప్రజలను దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు వివిధ ఆఫర్లతో బ్యాంక్ కస్టమర్లను ఆకర్షిస్తూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు ఖాతాదారులను కోరింది. దీనితో పాటు, ఏదైనా మోసం జరిగినప్పుడు మీ ఫిర్యాదును వెంటనే నమోదు చేయాలని బ్యాంక్ సూచించింది.
ఏదైనా సైబర్ నేరస్థుడు ఫిషింగ్ ద్వారా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తే, అటువంటి పరిస్థితిలో వెంటనే మీ ఫిర్యాదును ఫైల్ చేయండి అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేసింది. దీని కోసం మీరు సైబర్ క్రైమ్ వెబ్‌సైట్ cybercrime.gov.in ని సందర్శించడం ద్వారా మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీరు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయడం ద్వారా కూడా మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చని సూచించింది.
సైబర్ మోసాన్ని నివారించే మార్గాలు
☛ సైబర్ క్రైమ్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఖచ్చితంగా ఎవరితోనూ పంచుకోకండి.
☛ ఏదైనా ఆఫర్ లింక్‌పై క్లిక్ చేసే ముందు, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆ ఆఫర్ గురించి ధృవీకరించండి.
☛ మీ పాన్ కార్డ్ వివరాలు, ఆధార్ వివరాలు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పిన్, కార్డ్ నంబర్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు.
☛ టెలికాం కంపెనీ చేసే కాల్‌లపై మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు.
Phishing is one of countless techniques that fraudsters use to lure you into a scam, always be aware and if you find something suspicious, report it to : https://t.co/qb66kKVUB4#CISO #cybersecurity #AzadiKaAmritMahotsav #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/ISvNjOUhMp
— Punjab National Bank (@pnbindia) May 13, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి