Maruti Suzuki: మారుతి సుజుకీ కీలక నిర్ణయం.. రూ.11వేల కోట్లతో కొత్త తయారీ ప్లాంట్‌.. ఎక్కడంటే..!

Maruti Suzuki: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ హర్యానాలో ఏర్పాటు చేయనున్న తమ కొత్త తయారీ ప్లాంట్‌లో మొదటి దశలో రూ.11,000 కోట్ల పెట్టుబడి ..

Maruti Suzuki: మారుతి సుజుకీ కీలక నిర్ణయం.. రూ.11వేల కోట్లతో కొత్త తయారీ ప్లాంట్‌.. ఎక్కడంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: May 15, 2022 | 9:52 AM

Maruti Suzuki: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ హర్యానాలో ఏర్పాటు చేయనున్న తమ కొత్త తయారీ ప్లాంట్‌లో మొదటి దశలో రూ.11,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. MSI కొత్త తయారీ ప్లాంట్ గురించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. దీని ప్రకారం.. సోనిపట్ జిల్లాలోని ఐఎంటీ ఖర్ఖోడాలో 800 ఎకరాల భూమి కేటాయింపు ప్రక్రియను కంపెనీ పూర్తి చేసింది. దీని కోసం కంపెనీ హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HSIIDC)తో జతకట్టింది. కొత్త ప్లాంట్ మొదటి దశ 2025 నాటికి పూర్తవుతుందని కంపెనీ తెలిపింది. దీని ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 2.5 లక్షల యూనిట్లు. కొత్త ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి పరిపాలన అనుమతులు తీసుకోవాల్సి ఉంది.

ప్లాంట్ మొదటి దశపై 11,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు MSI తెలిపింది. సోనెపట్ తయారీ కర్మాగారం భవిష్యత్తులో కెపాసిటీ విస్తరణకు కూడా అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మారుతీ సుజుకి హర్యానా, గుజరాత్‌లలో రెండు ప్లాంట్ల ఉన్నాయి. దీని మొత్తం సామర్థ్యం సంవత్సరానికి 5.5 లక్షల యూనిట్లు.

భవిష్యత్తులో కంపెనీ మరిన్ని పెట్టుబడులు:

ఇవి కూడా చదవండి

MSI ప్రెసిడెంట్ ఆర్‌సి భార్గవ వివరాల ప్రకారం.. రూ. 11,000 కోట్ల పెట్టుబడిలో భూమి ఖర్చు, ప్రారంభ ఉత్పత్తి లైన్ల ఏర్పాటు, అన్ని ఇతర అనుబంధ మౌలిక సదుపాయాల ఏర్పాటు ఉన్నాయి. ఎలాంటి ఆర్థిక వివరాలను పంచుకోని భార్గవ.. మేము ముందుకు సాగినప్పుడు మరిన్ని పెట్టుబడులు పెడతాము. రానున్న కాలంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ ప్లాంట్ కంపెనీకి దోహదపడుతుంది.. అని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే