AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kisan Credit Card: ఇప్పుడు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై వడ్డీ ఉండదా..? ఇందులో నిజం ఎంత.. ఇందిగో క్లారిటీ!

Kisan Credit Card: సోషల్‌ మీడియాతో ప్రతి రోజు ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఫేక్‌ న్యూస్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఎంతో మంది నమ్మి ..

Kisan Credit Card: ఇప్పుడు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై వడ్డీ ఉండదా..? ఇందులో నిజం ఎంత.. ఇందిగో క్లారిటీ!
Kisan Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: May 15, 2022 | 8:52 AM

Kisan Credit Card: సోషల్‌ మీడియాతో ప్రతి రోజు ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఫేక్‌ న్యూస్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఎంతో మంది నమ్మి మోసపోతున్నారు. ఇక మరో వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి కిసాన్‌ క్రెడిట్‌ క్రెడిట్ కార్డ్‌ (KCC)పై ఎలాంటి వడ్డీ వసూలు చేయబడదని సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్‌ అవుతోంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కింద ఇచ్చే రూ.3 లక్షల వరకు రుణాలు 7 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి రోజు నుండి అంటే ఏప్రిల్ 1 నుండి కిసాన్‌ క్రెడిట్‌కార్డుపై వడ్డీ ఉండదని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇలాంటివి నమ్మవద్దని తెలిపింది. భారత ప్రభుత్వ పత్రికా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌చెక్‌ఈ వైరల్‌ అవుతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద వడ్డీ లేని రుణం ఇస్తున్నారని వస్తున్న వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇదంతా అబద్దమని, ఇలాంటివి నమ్మవద్దని పీఐపీ సూచించిం

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు స్కీమ్‌ కింద గత రెండేళ్లలో 2.92 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం కిసాన్‌ క్రెడిట్‌ కార్డును జారీ చేసింది. దీనిపై తీసుకున్న రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణాలపై వడ్డీరేటు 7 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. ఇందులో 2 శాతం సబ్సిడీ ఇస్తుంది. అసలు మొత్తం, వడ్డీని సకాలంలో తిరిగి చెల్లిస్తే అందులో 3 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యే వార్తలను నమ్మవద్దని సూచించింది. రైతులు కేసీసీపై రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. ప్రస్తుతం రైతులు 4 శాతం వడ్డీ చెల్లించాలి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.16,000 కోట్ల అదనపు భారం పడనుంది. ఇక అసత్యపు వార్తలపై స్పష్టత ఇస్తూ, కేంద్ర ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తెలిపింది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కింద వడ్డీ లేని రుణం ఇస్తామన్న వాదన నకిలీదని స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలు, ఇతర వాటిపై సోషల్‌ మీడియాలో ప్రతి రోజు తప్పుడు సమాచారాలు వస్తుంటాయి. దీంతో ఫ్యాక్ట్‌ చెక్‌ ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నిజాలను వెల్లడిస్తుంటుంది.

PM కిసాన్ పథకం ద్వారా కిసాన్‌ క్రెడిట్‌ కార్డును పొందవచ్చు. వెబ్‌సైట్‌లో మీకు KCC దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును పూర్తి చేసి, సమర్పించిన తేదీ నుండి 14 రోజులలోపు KCC ఆమోదించబడాలి. లేదంటే బ్యాంకు మేనేజర్‌పై ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకులు సాధారణంగా కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని సులభంగా తయారు చేయవు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ కార్డు పథకాన్ని పీఎం కిసాన్ పథకంతో అనుసంధానం చేసింది.

ఇవి కూడా చదవండి

కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడం ఎలా..?

కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడానికి మార్గం సులభం. ముందుగా, మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (pmkisan.gov.in) వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఇక్కడ డౌన్‌లోడ్ కిసాన్ క్రెడిట్ ఫారమ్ ఆప్షన్ ఫార్మర్స్ కార్నర్‌లో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాన్ని పూర్తిగా పూరించాలి. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఫోటోకాపీని జత చేయండి. అఫిడవిట్ కూడా పెట్టండి. తర్వాత వెరిఫై అయిన తర్వాత కార్డు పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి