AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fuel Pumps Close: హైదరాబాద్‌లో అర్థరాత్రి దాటకముందే మూతపడుతున్న పెట్రోల్‌ బంకులు.. కారణం ఏంటంటే..!

Fuel Pumps Close: ఒక వైపు పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు పెట్రోల్‌, డీజిల్‌ కొరత..

Fuel Pumps Close: హైదరాబాద్‌లో అర్థరాత్రి దాటకముందే మూతపడుతున్న పెట్రోల్‌ బంకులు.. కారణం ఏంటంటే..!
Fuel Pumps
Subhash Goud
|

Updated on: May 14, 2022 | 1:46 PM

Share

Fuel Pumps Close: ఒక వైపు పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గుల ధరల కారణంగా నగరంలోని డీజిల్, పెట్రోల్ బంక్‌లు, ముఖ్యంగా హెచ్‌పిసిఎల్ డీలర్లు సరఫరా కొరతను ఎదుర్కొంటున్నారు. దీంతో నగరంలోని పలు పెట్రోలు బంక్‌లు అర్ధరాత్రి దాటకముందే మూతపడుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు, ఓవర్‌హెడ్‌లు, వేతనాలపై ఆదా చేయడం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు చమురు కంపెనీలు తమ క్రెడిట్ విధానాన్ని మార్చుకున్నాయి. పరిశ్రమలు, టీఎస్‌ఆర్‌టీసీ (TSRTC) వంటి బల్క్ కొనుగోలుదారులకు రేట్లు ఎక్కువగా ఉన్నాయి.

నగరంలోని పెట్రోల్, డీజిల్ డీలర్‌లకు చమురు కంపెనీలు వ్యూహాత్మకంగా సరఫరాను నిరుత్సాహపరుస్తున్నాయి, ఇది రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ కొరతకు దారితీస్తుందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో రోజుకు 35 లక్షల లీటర్ల పెట్రోల్‌ వినియోగం ఉండగా, అదే డీజిల్‌ 40 లక్షల లీటర్లు వినియోగం ఉంది. రోజురోజుకు పెట్రోల, డీజిల్‌ ధరలు పెరుగుతుండడంతో అమ్మకాలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని డీలర్లు చెబుతున్నారు. కొంతమంది డీలర్ల ప్రకారం.. తమ నష్టాలను తగ్గించుకోవడానికి, చమురు కంపెనీలు TSRTC వంటి బల్క్ కొనుగోలుదారుల కోసం ఇంధన ధరలను పెంచాయి. అయితే మొత్తాన్ని తరువాత తీసుకోకుండా డీలర్లను ముందుగానే మొత్తాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. HPCL విషయానికి వస్తే.. వారు ఇంతకుముందు రెండు షిఫ్టుల మాదిరిగా కాకుండా ఇప్పుడు ఒక షిఫ్టులో మాత్రమే పని చేస్తున్నారు. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వానదారులు ఇబ్బందులు పడుతుంటే.. ఇంధనం కొరత కారణంగా కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. ధరలు పెరగడంతో వాహనదారులకు మరింత భారంగా మారుతోంది. సామాన్యులు వాహనాలు బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింతగా పెరగవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి