Hyderabad: చిన్నారుల కోసం అందుబాటులోకి గ్యాడ్జెట్ ఫ్రీ ప్లే ఏరియాలు..18 రకాల అట్రాక్షన్స్ గేమ్స్ ఏర్పాటు..

హైదరాబాద్ మహానగరంలో పిల్లలను ఎంగేజ్ చేసేందుకు గ్యాడ్జెట్ ఫ్రీ ప్లే ఏరియాలు(Gadget Free Play Area) ఏర్పాటవుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ (Summer Holidays) కావడంతో పెద్ద ఎత్తున కిడ్స్ గేమ్స్ ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Hyderabad: చిన్నారుల కోసం అందుబాటులోకి గ్యాడ్జెట్ ఫ్రీ ప్లే ఏరియాలు..18 రకాల అట్రాక్షన్స్ గేమ్స్ ఏర్పాటు..
Thrill City Futuristic Them
Follow us
Surya Kala

|

Updated on: May 14, 2022 | 2:46 PM

Hyderabad: మారుతున్న కాలంతో పాటు.. మనిషి జీవన విధానంలో కూడా పలు మార్పులు వచ్చాయి. యాంత్రిక యుగంలో కాలంతో పాటు ఉరుకులు పరుగులు పెడుతూ.. పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక  పిల్లల గురించి మాట్లాడుకుంటే.. చదువులు టీవీ, సెల్ ఫోన్లతోనే రోజంతా గడుతుపుతూ.. మానసికంగా శారీరకంగా ఆహ్లాదకరం అన్న మాటనే మరచిపోతున్నారు. కాంక్రీట్ జంగల్‌లో స్థలాలు మాయమవుతున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్ మహానగరంలో పిల్లలను ఎంగేజ్ చేసేందుకు గ్యాడ్జెట్ ఫ్రీ ప్లే ఏరియాలు(Gadget Free Play Area) ఏర్పాటవుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ (Summer Holidays) కావడంతో పెద్ద ఎత్తున కిడ్స్ గేమ్స్ ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్లెస్ రోడ్ లో సర్కస్ థీమ్ తో క్రేజీ కిడ్జీ పేరుతో ప్లే ఏరియా అందుబాటులోకి వచ్చింది.

పిల్లలు మానసిక, శారీరక ఎదుగుదల కోసం నిత్యం వ్యాయం గానీ, ఆటలు ఆడాటం ఎంతో శ్రేయస్కారం అంటుంటారు నిపుణులు. మారుతున్న కాలానుగుణంగా సాంకేతికంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆన్‌లైన్ గేమ్స్ వచ్చాక, శారీరక శ్రమకు శ్రద్ధ తగ్గుతోంది. వీడియో గేమ్స్ వచ్చాక, బయటకు వచ్చి ఆట స్థలాల్లో ఆడుకునే పరిస్థితియే లేకుండాపోయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో పిల్లలను ఎంగేజ్ చేసేందుకు గ్యాడ్జెట్ ఫ్రీ ప్లే ఏరియాలు అందుబాటులోకి వస్తున్నాయి. నెక్లెస్ రోడ్ లో సర్కస్ థీమ్ తో క్రేజీ కిడ్జీ పేరుతో ప్లే ఏరియా ఏర్పాటైంది. ట్రాంపోలిన్, స్లైడర్స్, వాల్ క్లైంబింగ్, స్టిక్కీ వాల్ , రోలింగ్ చైర్ వంటి 18 రకాల అట్రాక్షన్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు.

కరోనా ప్యాండమిక్ తరువాత పిల్లలు సెల్ ఫోన్లకు లాప్ టాప్ లకు , టీవిలకు, గ్యాడ్జెట్స్ కు అడిక్ట్ అవుతున్న సమయంలో ఇలాంటి గ్యాడ్జెట్ ఫ్రీ ప్లే ఏరియాలు ఎంతగానో దోహదపడుతాయని నిర్వాహకులు తెలిపారు. గేమ్స్ ఆడటం వల్ల పిల్లలకు ఫిజికల్ ఫిట్ నెస్ పెరుగుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. రోజు సాయంకాలం పిల్లలను తీసుకొచ్చి ఇలాంటి గేమ్స్ ఆడిస్తే మంచి మైండ్ సెట్ తో ఉంటారని అన్నారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో పెద్ద ఎత్తున కిడ్స్ గేమ్స్ ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పిల్లల కోసం ఆసక్తికరమైన పుట్టినరోజు వేడుకలు, వారి ఖాళీ సమయాల్లో అహ్లాదంగా పిల్లలతో గడిపేందుకు నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటైన క్రేజీ కిడ్జీ పేరుతో ప్లే ఏరియా అందుబాటులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

చాలా మంది తల్లిదండ్రులు పుట్టినరోజు అబ్బాయికి స్నేహితులను ఆహ్వానిస్తారు. వారి కోసం అన్ని వసతులతో ఏర్పాటైన క్రేజీ కిడ్జీ ఎంతో బాగుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..