Hyderabad: ప్రియుడిని చంపించిన శ్వేత కేసులో ఊహించని ట్విస్ట్.. ఆ మెసేజ్ కానీ చూసి ఉంటే..!
హైదరాబాద్‌లోని ప్రశాంత్‌హిల్స్‌లో ప్రియుడిని హత్య చేయించిన వివాహిత కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ముగ్గురు నిందితులను విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు.
Telangana: టెక్నాలజీని వాడ్డం తప్పు కాదు. అప్‌డేటెడ్‌గా ఉండడంలో తప్పు లేదు. కానీ రాంగ్ రూట్‌లో అప్లయ్ చేస్తే టెక్నాలజీకి కత్తి కన్నా పదునెక్కువ. తప్పు టెక్నాలజీది కాదు. తప్పుడు ఆలోచనలతో టెక్నాలజీని వాడుకుంటే ముప్పు తప్పదు. యశ్విన్- శ్వేత వ్యవహారంలో అదే జరిగింది. ఫేస్‌బుక్ లో పరిచయం..స్నేహం.. అక్రమ సంబంధానికి దారి తీయడం.. ఆ తరువాత జరిగిన పర్యావసనం అందరికి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో సంచలనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ మీర్‌పేట్(Meerpet)లో యశ్విన్ పై దాడి జరిగింది. చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో కన్నుమూశారు యశ్విన్. ప్రియుడిని చంపించిన శ్వేత కేసులో ఇప్పుడు నయా కోణం వెలుగుచూసింది. మొదట ప్రియుడిని హత్య చేయించాలని పథకం పన్నిన శ్వేతారెడ్డి చివరి నిమిషంలో హత్యచేయవద్దన్న మెసేజ్‌ను మరో ప్రియుడు అశోక్‌కు పంపినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే సుత్తితో కొట్టడంతో… బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. తల వెనక కొడితే మతిస్థిమితం కోల్పోతాడనే దాడి చేశామంటూ నిందితులు పోలీసుల ఎదుట చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
సీసీ ఫుటేజ్‌తో మొత్తం బాగోతం వెలుగులోకి..
సీన్ అఫెన్స్ ..యాక్సిడెంట్‌లానే ఉంది. కానీ సీసీ పోలీసింగ్‌తో నిప్పులాంటి నిజం తెరపైకి వచ్చింది. సీసీ ఫుటేజీ వెలుగులోకి వచ్చాక.. మీర్‌పేట పోలీసులు యశ్విన్ కాల్‌డేటా ఆధారంగా కూపీలాగారు. చివరగా యశ్విన్ ఎవరెవరికి ఫోన్ చేశాడో చెక్ చేస్తే శ్వేతారెడ్డి నెంబర్ తళుక్కుమంది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తే టోటల్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. మరి అశోక్, కార్తిక్ ఎవరు? ఆమెతో వాళ్లకేంటి లింక్?.. అన్న విషయంపై కూడా పోలీసులకు పూర్తి వివరాలు తెలిశాయి. అశోక్‌ది కృష్ణాజిల్లా తిరువూరు మండలం. అతడు ఓ బ్యాంక్‌లో ఎంప్లాయి. బ్యాంకులో ఆయన కార్యకలాపాల మాటేమో కానీ యశ్విన్ కేసులో కూసీలాగితే భామాకలాపం తెరపైకి వచ్చింది. అశోక్-శ్వేతారెడ్డికి ఫేస్‌బుక్‌లోనే పరిచయం. అది కూడా జస్ట్ నాలుగైదు నెలల క్రితమే. అంతలోనే ఇంటిమసి పెరిగి ఇల్లీసిట్ రిలేషన్ వరకు వెళ్లడం,, యశ్విన్ హత్యలో పాల్గొవడం వరకు వెళ్లింది. బ్యాంకులో కూడికలు తీసివేసితలు చేసినంత వీజీగా యశ్విన్‌ను మర్డర్ చేసి యాక్సిడెంట్ ఖాతాలో కలిపేందుకు తన కన్నింగ్ తెలివి తేటల్ని వాడాడు. మూడో కంటికి చిక్కాడు.
పోలీస్ వెర్షన్ ప్రకారం నిందితులు సినిమాటిక్‌గా స్కెచ్చేశారు. అనుకున్నది అనుకున్నట్టుగా ప్లాన్‌ను అమలు చేశారు. కానీ చివరకు ఏమైంది. ఎంతటి నేరస్థులైనా ఏదో చిన్న క్లూతో చట్టానికి చిక్కక తప్పదు కదా. అదే జరిగింది. సీసీ పోలీసింగ్‌తో నిందితుల సీన్ సితారైంది. శ్వేతారెడ్డి అశోక్‌తో పాటు వారికి సహకరించిన కార్తీక్‌ను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. దర్యాప్తులో సంచలనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
కేసు దర్యాప్తులో పోలీసులు ప్రాథమికంగా వెల్లడించిన వివరాలు ఇవి. కూపీలాగే కొద్దీ విచారణలో సంచలనాలు తెరపైకి వస్తున్నాయనేది సమాచారం. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు ఎంక్వయిరీని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. నిందితులుగా శ్వేతారెడ్డి, అశోక్, కార్తీక్‌లను అదుపులోకి తీసుకున్నారు సరే. యశ్వన్ మర్డర్ కేసులో అసలు నిజాలేంటి? ఎవరి పాత్ర ఏంటి?..దర్యాప్తులో ఇంకెన్ని సంచలనాలు..ఎలాంటి ట్విస్టులు తెరపైకి రానున్నాయో అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.