Amit Shah Speech Highlights: ముగిసిన అమిత్‌ షా సుదీర్ఘ ప్రసంగం.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు..

|

Updated on: May 14, 2022 | 9:04 PM

Amit Shah Speech Highlights: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన ముగిసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న షా సుదీర్ఘ ప్రసంగం చేశారు. దాదాపు 30 నిమిషాలు మాట్లాడిన షా...

Amit Shah Speech Highlights: ముగిసిన అమిత్‌ షా సుదీర్ఘ ప్రసంగం.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు..

Amit Shah Speech Highlights: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన ముగిసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న షా సుదీర్ఘ ప్రసంగం చేశారు. దాదాపు 30 నిమిషాలు మాట్లాడిన షా టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

రేపటి రేపు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని షా అన్నారు. రైతుల రుణమాఫీ చేస్తానని ఎందుకు చేయలేదని విమర్శించారు. తాంత్రికుడు చెప్పాడని కేసీఆర్‌ సెక్రటేరియట్‌ వెళ్లలేదని కేసీఆర్‌పై సెటైర్లు వేశారు అమిత్‌ షా. ఇక తెలంగాణ ఆసుపత్రుల తీరు అధ్వాన్నంగా ఉందన్న కేంద్ర మంత్రి జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తానని చేయలేదని విమర్శించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 May 2022 08:39 PM (IST)

    అమిత్‌ షా ప్రసంగంపై మొదలైన టీఆర్‌ఎస్‌ అటాక్‌..

    అమిత్ షా కేసీఆర్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై టీఆర్‌ఎస్‌ నాయకులు రివర్స్‌ అటాక్‌ ప్రారంభించారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. ‘అమిత్‌ షా మాట్లాడిన ప్రసంగంలో తెలంగాణకు సంబంధించి ఒక్క మంచి విషయం మాట్లాడలేదు. తెలంగాణ అభివృద్ధికి ఏం చేస్తామన్న ఒక్క మాట చెప్పలేదు. తెలంగాణకు ఏం చేస్తామో చెప్పకుండా, పాత చింతకాయ పచ్చడి అన్నట్లు తెలంగాణపై బీజేపీకి ఉన్న సవితి తల్లి ప్రేమను మరోసారి చూపించారు. అవినీతిని దేశంలో వ్యవస్థీకృతం చేసిన పార్టీ బీజేపీ. ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి ఇద్దరు గుజరాతీలకు దేశాన్ని దాసోహం చేశారు’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

  • 14 May 2022 08:27 PM (IST)

    ముగిసిన అమిత్‌ షా ప్రసంగం..

    ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రసంగం ముగిసింది. దాదాపు 30 నిమిషాలు మాట్లాడిన షా టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రేపటి రేపు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని షా అన్నారు.

  • 14 May 2022 08:20 PM (IST)

    టీఆర్‌ఎస్‌పై షా అటాక్‌..

    టీఆర్‌ఎస్‌ పార్టీపై అమిత్‌ షా తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'తెలంగాణను కేసీఆర్‌ మరో బెంగాల్‌ చేస్తున్నారు. ఫైవ్‌ స్టార్‌ ఫామ్‌ హౌజ్‌లో కూర్చొని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది. టీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది. కేసీఆర్‌ తెలంగాణను అప్పుల్లో ముంచేశారు. మరిన్ని అప్పులు కావాలని కోరుతున్నారు. మీ కొడుకు, కూతురు విలాసాల కోసం అప్పులు ఇవ్వాలా.? హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీ ఏర్పాటుకు 25 ఎకరాలు అడిగితే ఇవ్వలేదు, వరంగల్‌లో సైనిక్‌ స్కూల్‌కి టీఆర్‌ఎస్‌ పార్టీ భూమి ఇవ్వలేదు.

  • 14 May 2022 08:00 PM (IST)

    సభను ఉద్దేశించి మాట్లాడుతోన్న అమిత్‌ షా..

    తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ చేసిన ప్రజా సంగ్రామ యాత్ర గరించి అమిత్‌ షా మాట్లాడుతూ.. 'ఈ యాత్ర నిరంకుశ పాలను అంతమొందించడానికి చేసింది. ఇది ప్రజంలదరి క్షేమం కోసం చేసిన యాత్ర. కేసీఆర్‌ను గద్దె దించేందుకు నేను రావాల్సిన అవసరం లేదు, బండి సంజయ్‌ ఒక్కడు చాలు. రాష్ట్రంలో అధికారం కోసం సంజయ్‌ యాత్ర చేయలేదు, హైదరాబాద్‌ నిజాంను మార్చేందుకు యాత్ర చేశారు.

    నీళ్లు, నిధులు, నియామకాలు అన్న కేసీఆర్‌ వాగ్దనాలు తీర్చలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే వాటన్నింటినీ మేము చేసి చూపిస్తాం. జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ అన్నాడు చేయలేడు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, మూడు సెంటీ మీటర్లు కూడా ఇవ్వలేదు. టీఆర్‌ఎస్‌ పాలనను అంతం చేయాల్సిన సమయం వచ్చింది. ఎవరో తాంత్రికుడు చెప్పారని కేసీఆర్‌ సెక్రటేరియట్‌ వెళ్లడం మానేశారు. నిరుద్యోగులకు ఇస్తానన్న భృతీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకాన్ని నిర్వీర్యం చేశారు.

  • 14 May 2022 07:48 PM (IST)

    టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడుతోన్న బండి సంజయ్‌..

  • 14 May 2022 07:36 PM (IST)

    సభను ఉద్దేశించిన మాట్లాడుతోన్న బండి సంజయ్‌..

    ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. 'సభకు చాలా మంది చేరుకోలేక పోయారు. ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయారు వారందరికీ నా క్షమాపణలు చెబుతున్నాను.

    గోల్కోండ కోటపై కాషాయ జెండా రెపరెపలాడిస్తాం. హామీలు నెరవేర్చకుండా కేసీర్‌ మోసం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబం లూటీ చేస్తోంది. రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలనే యాత్ర చేశాను. ఎక్కడ వెళ్లినా మోడీ.. మోడీ అనే నినాదమే వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ పాలనలో అంతా అవినీతే. ఆరోగ్య శాఖ, వైద్య, మున్సిపల్‌, మైన్స్‌ శాఖలన్నీ కేసీఆర్‌ కుటంబం ఆధీనంలో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థితి లేదు. ఈ మూర్ఖత్వపు పాలన పోక పోతే బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందని వెంటనే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాను.

  • 14 May 2022 07:27 PM (IST)

    సభను ఉద్దేశించి మాట్లాడుతోన్న కిషన్‌ రెడ్డి..

    ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు కేంద్రం ఏం చేస్తుందో వివరిస్తూ.. 'రూ. 30 వేల కోట్లను ఉపాధి హామీ పనులకు ఇచ్చాం. రైతులకు సబ్సీడీతో ఎరువులు ఇస్తున్నాం. రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందో చెప్పడానికే అమిత్‌ షా హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌ రావాలంటే కేసీఆర్‌ అనుమతి కావాలా.? తెలంగాణ ఏమైనా వారి జాగీరా.? రాష్ట్రాన్ని ఏమైనా కేసీఆర్‌ కుటుంబానికి రాసిచ్చారా.? టీఆర్‌ఎస్‌ ఏ మొఖంతో ప్రశ్నలు అడుగుతుంది' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

  • 14 May 2022 06:50 PM (IST)

    సభా స్థలికి బయలుదేరిన అమిత్ షా..

  • 14 May 2022 06:47 PM (IST)

    కేసీఆర్‌పై ఈటల అటాక్‌..

    హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్‌పై మాటల దాడి చేస్తున్నాడు. ఢిల్లీలో ధర్నా చేస్తే గొప్పవాళ్లు అవుతారా అని ఈటల వ్యాఖ్యానించారు. రైతుల కళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మట్టికొట్టిందని విమర్శించారు. ఈటల రాజేందర్‌ ఇంకా మాట్లాడుతూ.. 'అన్ని రంగాల్లో కేసీఆర్‌ పాలన విఫలమైంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఇచ్చే షాక్‌కు టీఆర్‌ఎస్‌కు దిమ్మతిరుగుతుంది' అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

  • 14 May 2022 06:08 PM (IST)

    ప్రత్యేకంగా సమావేశమైన అమిత్‌షా..

    బీజేపీ కోర్‌ కమిటీ నేతలతో భేటీ పూర్తి చేసుకున్న అమిత్‌షా అనంతరం పలువురు నేతలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కిషన్ రెడ్డి , విజయ శాంతి, తరుణ్ చుగ్ ఉన్నారు. అయితే షా వీరితో ఏం మాట్లాడన్నర విషయం మాత్రం తెలియరాలేదు.

  • 14 May 2022 05:54 PM (IST)

    అమిత్‌ షా పర్యటనపై హరీశ్‌ కౌంటర్‌..

    అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అటాక్‌ వేస్తున్న సమయంలో మంత్రి హరీష్‌ రావు తనదైన శైలిలో కౌంటర్‌ వేశారు. ప్రపంచ పక్షుల దినోత్సవం గురించి ట్వీట్ చేస్తూ.. 'వలస పక్షులు తమకు నచ్చిన ప్రదేశాలకు వెళ్తాయి. అక్కడి ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తాయి. నచ్చిన తిండి తింటాయి. గుడ్లు పెట్టి తిరిగి వెళ్లిపోతాయి. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం రోజే తెలంగాణలో అమిత్ షా పర్యటన జరుగుతుండడం యాదృచ్చికం' అంటూ రాసుకొచ్చారు.

  • 14 May 2022 05:49 PM (IST)

    సభ వద్ద గద్దర్‌ ప్రత్యక్షం..

    Gaddar

    ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ వద్ద ప్రజా గాయకుడు గద్దర్‌ కనిపించారు. అమిత్‌షా కోసం ఏర్పాటు చేసిన టెంట్‌ వద్ద గద్దర్‌ ఉండడంతో అందరి దృష్టి పడింది. నోవాటెల్‌ హోటల్‌ నుంచి మరికాసేపట్లో సభా ప్రాంగణం చేరుకోనున్న అమిత్‌షాతో గద్దర్‌ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • 14 May 2022 05:33 PM (IST)

    భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలివే..

    బీజేపీ కోర్‌ కమిటీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్‌షా భేటీ పూర్తయింది. ఈ భేటీలో తెలంగాణ రాజకీయాలు, పార్టీ అవకాశాలపై అమిత్‌షో నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా పార్టీ పరిస్థితిని నేతలు అమిత్‌షాకు నేతలు వివరించారు. పార్లమెంట్‌, దుబ్బాక, గ్రేటర్‌, హుజురాబాద్‌ ఎన్నికల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. భేటీలో బాగంగా అమిత్‌షా నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల గురించి తెలుసుకున్నారు. కష్టపడితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నేతలతో అమిత్‌షా అన్నారు.

  • 14 May 2022 05:14 PM (IST)

    బీజేపీ కోర్‌ కమిటీ నేతలతో మొదలైన అమిత్‌షా భేటీ..

    బీజేపీ కోర్‌ కమిటీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్‌షా భేటీ మొదలైంది. తెలంగాణ బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై షా కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేయనున్నట్లు, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరగనున్నట్లు సమాచారం.

  • 14 May 2022 05:07 PM (IST)

    శంషాబాద్‌ చేరుకున్న షా..

    ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు హాజరుకావడానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితమే రామంతపూర్‌లోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ క్యాంపస్‌లోని నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన షా రోడ్డు మార్గాన శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ బీజేపీ కోర్‌ కమిటీ నేతలతో భేటీ కానున్నారు.

  • 14 May 2022 04:24 PM (IST)

    5 లక్షల మందితో సభ..

    తుక్కుగూడలో జరగనున్న ప్రజా సంగ్రామ యాత్ర ముంగింపు సభను బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఏకంగా 5 లక్షల మందితో సభను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు షా బహిరంగ సభలో మాట్లాడనున్న విషయం తెలిసిందే.

  • 14 May 2022 04:21 PM (IST)

    షా ఏం మాట్లాడనున్నారు..?

    ఓవైపు టీఆర్‌స్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అమిషా టూర్‌ను ఉద్దేశిస్తూ పొలిటికల్‌ టూరిస్టులు అంటూ, తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించిన నేపథ్యంలో. తుక్కుగూడలో జరగనున్న బహిరంగ సభలో అమిత్‌ షా ఏం మాట్లాడుతారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌పై షా నేరుగా అటాక్‌కు దిగుతారా.? అన్న దానిపై అందరి దృష్టి పడింది.

  • 14 May 2022 03:41 PM (IST)

    రామంతపూర్‌ చేరుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి..

    బేగంపేట నుంచి రోడ్డు మార్గన రామంతపూర్‌ చేరుకున్న అమిత్‌ షా. సీఎఫ్‌ఎస్‌ఎల్‌ క్యాంపస్‌లోని నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌ బయలు దేరనున్నారు.

  • 14 May 2022 03:15 PM (IST)

    హైదరాబాద్‌ చేరుకున్న అమిత్‌షా..

    కేంద్ర హోం మంత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన అమిత్‌షాను కిషన్‌ రెడ్డి, మురళీధర్‌ రావు, దుబ్యాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌, ఈటల రాజేందర్, విజయ శాంతి, వివేక్ తో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయన రోడ్డు మార్గంలో రామంతపుర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి వెళ్తున్నారు.

  • 14 May 2022 03:06 PM (IST)

    20 నిమిషాలు ఆలస్యం..

    షెడ్యూల్‌ ప్రకారం అమిత్‌షా 2.35 గంటలకు బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉండగా 20 నిమిషాలు ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ప్రత్యేక విమానం ద్వారా షా బేగం పేట చేరుకోనున్నారు.

  • 14 May 2022 03:02 PM (IST)

    అమిత్ షా ట్వీట్..

  • 14 May 2022 03:01 PM (IST)

    మొదట అంబర్ పేట వెళ్లనున్న షా..

    3 గంటలకు  అంబర్ పేటలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి  వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు  చేరుకుంటారు.

Published On - May 14,2022 2:58 PM

Follow us
Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..