TS Tenth Exams 2022: తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో అయోమయం! ఇంతకీ రెండు పేపర్లా.. ఒకే పేపరా?

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్ధుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టెన్త్‌ 2022 పబ్లిక్‌ పరీక్షల హాల్ టికెట్లు కూడా విడుదల..

TS Tenth Exams 2022: తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో అయోమయం! ఇంతకీ రెండు పేపర్లా.. ఒకే పేపరా?
TS Inter Exams
Follow us
Srilakshmi C

|

Updated on: May 14, 2022 | 1:12 PM

Two papers for TS SSC Telugu Exam 2022: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్ధుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టెన్త్‌ 2022 పబ్లిక్‌ పరీక్షల హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు (TS SSC Hall Tickets 2022) డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. తీరా అందులోని పరీక్షల వివరాలను చూసి అందోళనకు గురవుతూ ఉపాధ్యాయులను ఆశ్రయిస్తున్నారు. ఈ సారి ఒక్క సైన్స్‌ పాఠ్యాంశానికే ఒకే రోజు రెండు పరీక్ష పేపర్లు పెడుతుండగా, మిగిలిన అయిదు సబ్జెక్టులకు ఒక్క పేపర్‌ను మాత్రమే పెడుతున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే హాల్‌టికెట్లలో మే 23న ప్రారంభమయ్యే తెలుగు పరీక్షకు (Telugu Exam) మాత్రం పేపర్‌-1, పేపర్‌-2 ఉండటం చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. తెలుగు పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారా? అనే సందేహం వ్యక్తమవుతున్నట్లు తెలుగు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దీంతో పరీక్షలు ఒకటే పేపర్‌తో నిర్వహిస్తారా? లేదా పాత పద్ధతిలో రెండు పేపర్లకు నిర్వహిస్తారో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు

ఈ నెల 23 నుంచి పరీక్షలు ప్రారంభం.. రాష్ట్రంలో మే 23వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారులను జిల్లా పర్యవేక్షణ అధికారులుగా విద్యాశాఖ నియమించింది. ఒక్కో అధికారికి ఒకటి నుంచి అయిదు జిల్లాల చొప్పున కేటాయించారు. వారు ప్రతిరోజూ పరీక్షలు జరిగిన తీరుపై నివేదికలు అందజేయాలి. ఈసారి పరీక్షా కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెండెంట్లు(సీఎస్‌), డిపార్ట్‌మెంటల్‌ అధికారులు(డీవో) కూడా సెల్‌ఫోన్లు వినియోగించడానికి వీల్లేదని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. గతంలోనే ఇలాంటి నిబంధన ఉంది. అత్యవసరమైతే పోలీస్‌ కానిస్టేబుల్‌ వద్ద ఉన్న ఫోన్‌ను వాడుకోవాలని 2016లో ఆదేశాలిచ్చారు.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read:

TSPSC 2022 Group-1: ఊపందుకున్న టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 దరఖాస్తులు.. ఇప్పటివరకు 93,813 మంది..