AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Indonesia, Thomas Cup Final:: చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్.. తొలిసారి థామస్‌ కప్‌ చేజిక్కించుకున్న భారత్‌..

Thomas Cup 2022: బ్యాడ్మింటన్‌ ఆడే ప్రతి ఆటగాడు ఆడాలని కోరుకునే, ఓ పతకమైనా సాధించాలని స్వప్నించే టోర్నమెంట్‌ థామస్‌ కప్‌. 73 ఏండ్ల థామస్‌ కప్‌ చరిత్రలో భారత్ ఎన్నడూ పతకం సాధించలేదు. ఆ లోటు తీర్చాడు మన తెలుగు కుర్రాడు, మెరుపు తేజం కిదాంబీ శ్రీకాంత్.

India vs Indonesia, Thomas Cup Final:: చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్.. తొలిసారి థామస్‌ కప్‌ చేజిక్కించుకున్న భారత్‌..
Srikanth Kidambi
Basha Shek
|

Updated on: May 15, 2022 | 3:50 PM

Share

Thomas Cup 2022: బాట్మింటన్ లో కిదాంబీ శ్రీకాంత్ (Kidambi Srikanth)  హిస్టరీ క్రియేట్ చేశారు. భారత్‌కు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. మొట్టమొదటిసారిగా థామస్ కప్ సింగిల్స్ కేటగిరీలో విన్నర్‌గా నిలిచి.. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాడు. 73 ఏండ్లలో తొలిసారి పథకం కైవసం చేసుకుంది టీమ్‌ ఇండియా. బ్యాడ్మింటన్‌ ఆడే ప్రతి ఆటగాడు ఆడాలని కోరుకునే, ఓ పతకమైనా సాధించాలని స్వప్నించే టోర్నమెంట్‌ థామస్‌ కప్‌. 73 ఏండ్ల థామస్‌ కప్‌ చరిత్రలో భారత్ ఎన్నడూ పతకం సాధించలేదు. ఆ లోటు తీర్చాడు మన తెలుగు కుర్రాడు, మెరుపు తేజం కిదాంబీ శ్రీకాంత్.

73 ఏళ్ల చరిత్రలో..

ఇవి కూడా చదవండి

బ్యాడ్మింటన్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. గత 73 ఏళ్లుగా ఊరిస్తున్న ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో బ్యాంకాక్‌ వేదికగా మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. ఫైనల్‌లో థామస్ కప్‌లో అత్యంత విజయవంతమైన ఇండోనేషియాను భారత జట్టు ఓడించడం విశేషం. ఫైనల్‌లో 5 గేమ్‌లు ఉన్నా తొలి మూడు గేమ్‌లను వరుసగా గెల్చుకుంది భారత జట్టు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వలేదు. ఇక చివరి గేమ్‌లో తెలుగుతేజం కిదాంబీ శ్రీకాంత్‌ అసమాన్య పోరాటాన్ని ప్రదర్శించాడు. ఇండోనేషియాకు చెందిన ఫేమస్‌ ప్లేయర్‌ జొనాథన్‌ క్రిస్టీని సులభంగా ఓడించాడు. జొనాథన్‌ క్రిస్టీపై 21-15, 21-23తో వరుస సెట్లలో ఓడించాడు. దీంతో బెస్టాఫ్‌ 5లో వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గి భారత జట్టు ధామస్‌కప్‌ని కైవసం చేసుకుంది. కాగా చరిత్రలో తొలిసారి ఫైనల్‌కి చేరిన భారత జట్టు.. ఈరోజు దుమ్మురేపింది. ఇండోనేషియాపై 3-0 తేడాతో వరుస మ్యాచ్‌లలో నెగ్గి అద్భుతాన్ని ఆవిష్కరించింది. తొలి సింగిల్స్‌లో గింటింగ్‌పై లక్ష్యసేన్‌ విజయం సాధించాడు. తర్వాత జరిగిన డబుల్స్‌లో రంకిరెడ్డి, షెట్టి పూర్తి ఆధిపత్యం సాధించారు. ఇక మూడో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌ను భారత జట్టుకు అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Mistery village: సైన్స్‌కు సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం.. 12 ఏళ్లుగా అబ్బాయిలే పుట్టని ఊరు..! ఎక్కడంటే..

Board Exam: మమ్మల్ని పాస్ చేయండి.. లేదంటే ఇంట్లో పెళ్లి చేస్తారంటున్న స్టూడెంట్స్.. ఎక్కడంటే..

Inspiring Story: ‘టీ’ దుకాణం బంద్ చేసి.. సరికొత్త బిజినెస్‌లో అడుగు పెట్టిన చాయ్‌వాలీ ప్రియాంక