AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CPI Narayana: బీజేపీ సభ జయప్రదం అయ్యింది.. అమిత్ షా పర్యటనపై నారాయణ వ్యంగ్యాస్త్రాలు

తెలంగాణాలో ఒక్కసారి గెలిపిస్తే అదే అవుతుందంటూ సెటైర్లు విసిరారు. ఒకవిధంగా చెప్పాలంటే బీజేపీ సభ జయప్రదం అయ్యింది. అయితే “ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్” అన్నట్టు తెలంగాణాకు విభజన చట్టంలో..

CPI Narayana: బీజేపీ సభ జయప్రదం అయ్యింది.. అమిత్ షా పర్యటనపై నారాయణ వ్యంగ్యాస్త్రాలు
Narayana
Sanjay Kasula
|

Updated on: May 15, 2022 | 12:14 PM

Share

తెలంగాణలో హోంమంత్రి అమిత్ షా(Amit Shah) పర్యటనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీపీఐ నేత నారాయణ(Narayana). బీజేపీని తెలంగాణాలో ఒక్కసారి గెలిపిస్తే అదే అవుతుందంటూ సెటైర్లు విసిరారు. ఒకవిధంగా చెప్పాలంటే బీజేపీ సభ జయప్రదం అయ్యింది. అయితే “ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్” అన్నట్టు తెలంగాణాకు విభజన చట్టంలో ఇచ్చిన హామీల జోలికే వెళ్ళలేదు. దీన్నిబట్టి తెలుగు ప్రజలపై ప్రేమకన్నా ఓట్ల యాచకత్వమే మిన్న అన్నట్టుగా ఉందన్నారు. ఈ సభ జయప్రదం కావడానికి కేసీఆర్ రాజకీయ వైఖరి కారణం కాదా..? అంటూ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రజావ్యతిరేక చట్టాలను సీఎం కేసీఆర్ సమర్దించలేదా.. ? ఎఐఎంతో మీకున్న రాజకీయ సంబంధాలవలన బీజేపీ బలం పెంచుకోవడానికి టీఆర్ఎస్ అవకాశం కల్పించలేదా .. రాష్ట్రంలో రాజకీయ ప్రజాస్వామ్యం కల్పించకపోగా ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచనలు చేయలేదా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిచారు సీపీఐ నారాయాయణ.

లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్తను బలహీన పరిస్తే ఆస్థానాన్ని భర్తీ చేయడానికి బీజేపీకి అవకాశం ఇచ్చిందెవరు.. టీఆర్ఎస్ రాజకీయ తప్పిదాల ఫలితంగా తెలంగాణాలో బలమయిన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజలకు నష్టం కలుగుతోందన్నారు. ఇప్పటికైనా ద్వంద రాజకీయ విధానాలకు స్వస్తి చెబితే ప్రజలకు మేలు చేయగలరని హితువు పలికారు. లేకుంటే ఒక్కసారి ఓటు ఒక్కసారి వురికిసహకరించిన వారవుతారు అంటూ వీడియోను విడుదల చేశారు సీపీఐ నేత నారాయణ. బీజేపీ రాజకీయ బలం పెంచుకోవటానికి టీఆర్ఎస్ అవకాశం కల్పించిందని, ఒక్క అవకాశమని బీజేపీ అడుక్కోవడం సిగ్గుచేటని నారాయణ ఎద్దేవా చేశారు.

రాజకీయవార్తల కోసం

ఇవి కూడా చదవండి: Asaduddin Owaisi: ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు.. ఓటు బ్యాంక్‌పై ఓవైసీ కీలక కామెంట్స్‌..

Chandrababu: జగన్ ఇలాకాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్‌.. ఈనెల 18న కడపలో చంద్రబాబు పర్యటన..