AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eknath Reddy: పుల్లారెడ్డి మనవడికి బ్లడ్‌క్యాన్సర్‌..? ఫ్యామిలీ వివాదంలో కొత్త సంగతులు..

పుల్లారెడ్డి(Pullareddy) మనవడు ఏక్‌నాథ్‌రెడ్డి(Eknath Reddy) ఫ్యామిలీ ఎపిసోడ్‌లో కొత్త విషయాలు బైటికొస్తున్నాయి. భార్యను ఇంట్లో వుంచి బైటికి రాకుండా అడ్డుగా గోడకట్టిన ఏక్‌నాథ్‌.. నిన్నటినుంచి వార్తల్లో వున్నాడు. ఈ భార్యాభర్తల

Eknath Reddy: పుల్లారెడ్డి మనవడికి బ్లడ్‌క్యాన్సర్‌..? ఫ్యామిలీ వివాదంలో కొత్త సంగతులు..
Eknath Reddy
Sanjay Kasula
|

Updated on: May 15, 2022 | 12:43 PM

Share

పుల్లారెడ్డి(Pullareddy) మనవడు ఏక్‌నాథ్‌రెడ్డి(Eknath Reddy) ఫ్యామిలీ ఎపిసోడ్‌లో కొత్త విషయాలు బైటికొస్తున్నాయి. భార్యను ఇంట్లో వుంచి బైటికి రాకుండా అడ్డుగా గోడకట్టిన ఏక్‌నాథ్‌.. నిన్నటినుంచి వార్తల్లో వున్నాడు. ఈ భార్యాభర్తల మధ్య గొడవకు కారణాలేంటని ఆరా తీస్తే ఆసక్తికరమైన డీటెయిల్స్ బైటికొస్తున్నాయి. 2016లో బెంగుళూరుకు చెందిన ప్రజ్ఞారెడ్డిని పెళ్లి చేసుకున్నారు ఏక్‌నాథ్‌రెడ్డి. అప్పటికే బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏక్‌నాథ్‌రెడ్డి.. ఆ విషయాన్ని పెళ్లి సమయంలో దాచి పెట్టారు. ఇక్కడే భార్యాభర్తల మధ్య డిఫరెన్సెస్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏడు సంవత్సరాల తన బిడ్డకు ఆస్తి రాసివ్వాలని భర్తతో పేచీకి దిగారు ప్రజ్ఞారెడ్డి. కానీ ఆస్తి ఇవ్వడానికి నిరాకరించి.. భార్యా బిడ్డల్నే వదిలించుకోవాలని డిసైడై విడాకులకు అప్లయ్ చేశారు ఏక్‌నాథ్‌రెడ్డి. ఆస్తిలో భాగమిస్తేనే విడాకులంటూ కండిషన్ పెట్టడంతో భార్యతో ఘర్షణకు దిగాడు ఏక్‌నాథ్‌రెడ్డి. భార్య మరీ మొరాయించడం, బెంగుళూరు నుంచి ఆమె బంధువులు రావడంతో శుక్రవారం ఇంట్లో గోడ కట్టి పారిపోయాడు.

ఏక్‌నాథ్‌రెడ్డితో పాటు అతడి తల్లిదండ్రులు కూడా ఈ ఘాతుకంలో భాగస్వాములే అంటున్నారు ప్రజ్ఞారెడ్డి తండ్రి. ఆమెకు ప్రాణాపాయం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఇలా గోడ కట్టారని, ఏక్‌నాథ్‌ తల్లి భారతీరెడ్డి కూడా తన కూతుర్ని వేధించారన్నది ప్రజ్ఞారెడ్డి తండ్రి ఆవేదన. కొడుకు చేత.. విడాకుల పిటిషన్ వేయించి.. వాళ్ల కాపురంలో ఆమే నిప్పులు పోశారంటున్నారు ప్రజ్ఞారెడ్డి తండ్రి. ఏక్‌నాథ్ రెడ్డి తల్లిదండ్రుల వెర్షన్ తెలియాల్సి వుంది.

అటు.. ఏక్‌నాథ్‌ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ అనే కొత్త విషయం.. ఈ వివాదంలో కీలకంగా మారింది. అతడి వైపు సెంటిమెంట్‌ని డ్రైవ్ చేస్తోంది. భార్యాభర్తల మధ్య ఈ గోడ వివాదం.. ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

హైదరాబాద్ వార్తల కోసం 

ఇవి కూడా చదవండి: Asaduddin Owaisi: ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు.. ఓటు బ్యాంక్‌పై ఓవైసీ కీలక కామెంట్స్‌..

Chandrababu: జగన్ ఇలాకాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్‌.. ఈనెల 18న కడపలో చంద్రబాబు పర్యటన..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!