AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child care: మీ పిల్లలకు కట్‌ చేసిన పండ్లను టిఫిన్‌ బాక్స్‌లో వేసి ఇస్తున్నారా..? ప్రమాదమే..!

Fruits Eating Tips: చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల ఆరోగ్యం బాగుండేందుకు రకరకాల ఆహార పదార్ధాలను , పండ్లను ఇస్తుంటారు. ఇందుకోసం పనితో పాటు ప్రయత్నాల్లోనూ..

Child care: మీ పిల్లలకు కట్‌ చేసిన పండ్లను టిఫిన్‌ బాక్స్‌లో వేసి ఇస్తున్నారా..? ప్రమాదమే..!
Subhash Goud
|

Updated on: May 15, 2022 | 11:23 AM

Share

Fruits Eating Tips: చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల ఆరోగ్యం బాగుండేందుకు రకరకాల ఆహార పదార్ధాలను , పండ్లను ఇస్తుంటారు. ఇందుకోసం పనితో పాటు ప్రయత్నాల్లోనూ బిజీగానే ఉంటాడు. పిల్లల తిండి, చదువు, నిద్ర వంటి బాధ్యతలను నెరవేర్చడం అంత సులువు కాదు. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు తమ పిల్లలకు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం ఏమి ఇవ్వాలో తెలియక తికమక పడుతుంటారు. ఈ ప్రయత్నాల మధ్య, తల్లిదండ్రులు కొన్నిసార్లు అలాంటి తప్పులు చేస్తారు. ఇది ప్రయోజనానికి బదులుగా హానిని కలిగిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలకు టిఫిన్‌లో పండ్లు తరిగి పంపుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పద్ధతి వారి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని పండ్లను కోసి వెంటనే తింటే మంచిది. వాటిని తరువాత తింటే వాటి పోషకాలు చాలా ప్రభావవంతంగా ఉండవు. పిల్లలకు టిఫిన్‌లో కోసి ఉంచకూడని ఆ పండ్ల గురించి తెలుసుకుందాం.

విటమిన్ సి పండ్లు:

విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండ్ల కోసం వాటిని కోసిన వెంటనే తినాలని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తల్లిదండ్రులు కట్ చేసిన కివీ లేదా ఇతర పండ్లను టిఫిన్‌ బాక్స్‌లో పిల్లలకు ఇస్తారు. ఈ పండ్లను ఎక్కువసేపు కాంతికి గురై వాటిలో విటమిన్ సి తగ్గడం ప్రారంభమవుతుంది. మీకు కావాలంటే మీరు పాఠశాల నుండి వచ్చిన తర్వాత పిల్లవాడిని అలాంటి పండ్లను తినేలా చేయవచ్చు. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కోసి ఇవ్వవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉప్పు నీటిలో నానబెట్టడం:

ఉప్పు నీళ్లలో నానబెట్టిన పండ్లను తల్లిదండ్రులు టిఫిన్‌లో పిల్లలకు ఇస్తారు. వాటిని కోసి ఉప్పునీటిలో నానబెట్టడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ పద్ధతి పిల్లల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం క్షీణించిన సందర్భంలో పిల్లవాడు కడుపు నొప్పి లేదా అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.

అతిసారం ఉండవచ్చు:

తల్లిదండ్రులు తమ పిల్లలకు టిఫిన్‌లో కోసి పుచ్చకాయ లేదా సీతాఫలం వంటి వేసవి పండ్లను ఇస్తారు. వాటిని కోసి చాలాకాలం తర్వాత తింటే విరేచనాలు వస్తాయని చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా మీ బిడ్డ బలహీనంగా మారవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి