Jamun Health Benefits: అబ్బో అన్ని ప్రయోజనాలో.. నేరేడు పండ్లే కాదు చెట్టు ఆకులు, బెరడు, గింజలతో బోలెడు లాభాలు..

Health Benefits of Jamun: నేరేడు కాయలు ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఒక్క పండే కాదు.. నేరేడు చెట్టు ఆకులు, బెరడు, గింజలు కూడా ఎంతో మేలుచేస్తాయి. ఆకులు నేరేడు ఆకులతో చేసే కషాయం.. బ్యాక్టీరియల్‌..

Jamun Health Benefits: అబ్బో అన్ని ప్రయోజనాలో..  నేరేడు పండ్లే కాదు చెట్టు ఆకులు, బెరడు, గింజలతో బోలెడు లాభాలు..
Health Benefits Of Jamun
Follow us

|

Updated on: May 15, 2022 | 9:44 AM

వర్షాకాలం వస్తుందంటే నేరేడు(Jamun)చెట్టు కూడా మెల్లగా పూత పూసి కాయలు కాస్తుంది. నేరేడు కాయలు ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఒక్క పండే కాదు.. నేరేడు చెట్టు ఆకులు, బెరడు, గింజలు కూడా ఎంతో మేలుచేస్తాయి. ఆకులు నేరేడు ఆకులతో చేసే కషాయం.. బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టినచోట, దురదలు, సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే.. ఉపశమనం లభిస్తుంది. బెరుడు నేరేడు బెరడుతో చేసే కషాయాన్ని రక్త, జిగట విరేచనాలతో బాధపడేవారికి 30ఎమ్‌.ఎల్‌ నీళ్లలో కలిపి తేనె, పంచదార జోడించి ఇస్తే గుణం ఉంటుంది. నెలసరి సమస్యలకు నేరేడు చెక్క కషాయాన్ని 25 రోజులపాటు 30ఎమ్‌.ఎల్‌ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. నోట్లో పుండ్లు, చిగుళ్ల సమస్యలకు దీని కషాయం పుక్కిలిస్తే మార్పు ఉంటుంది.

  1.   నేరేడు విత్తనాలు, పొడపత్రి కాచు, పసుపు, ఎండు ఉసిరిక కలిపి పొడి చేసుకుని దాన్ని ప్రతి రోజు టీ స్పూన్ చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.
  2. నేరేడు ఆకు చూర్ణంతో పండ్లు తోమితే కదిలే దంతాలు గట్టిపడతాయి. అలాగే నేరేడు చెక్క కషాయాన్ని పుక్కిలిపడితే నోటిలోని పుండ్లు చాలా త్వరగా మానిపోతాయి.
  3. నేరేడు చిగుళ్లు, మామిడి చిగుళ్లు తీసుకుని వాటితో కషాయం కాచి, దానిలో తేనె చేర్చి సేవిస్తే, పైత్యపు వాంతులు వెంటనే తగ్గిపోతాయి.
  4. కిడ్నీలో రాళ్లు వున్నవారు నేరేడు పండ్లు తింటే అవి కరిగిపోవడమే కాదు మరోసారి రాళ్లు ఏర్పడే అవకాశమే వుండదు.

జాగ్రత్తలు: నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతోపాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది. విరుగుడు: ఉప్పు, వేడినీరు.

ఇక ముఖ్యమైన గమనిక ఏమిటంటే.. నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే జీర్ణాశయంలో సమస్య ఏర్పడి అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల ముందుగా ఏదో ఒకటి తిన్న తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాలి. అలాగే ఆపరేషన్ చేయించుకున్నవారు కూడా వైద్య సలహాలు తీసుకున్న తర్వాత వాటిని తినవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఆరోగ్య వార్త కోసం

ఇవి కూడా చదవండి: Asaduddin Owaisi: ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు.. ఓటు బ్యాంక్‌పై ఓవైసీ కీలక కామెంట్స్‌..

Chandrababu: జగన్ ఇలాకాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్‌.. ఈనెల 18న కడపలో చంద్రబాబు పర్యటన..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ