Cyber Fraud: సోషల్ మీడియా వినియోగదారులకు హెచ్చరిక..! మర్చిపోయి కూడా అలా చేయ్యొద్దు..!!
సైబర్ మోసగాళ్లు సరికొత్త మార్గాలలో అకౌంట్లను ఖాళీ చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదేపదే హెచ్చరిస్తోంది. సైబర్ దోస్త్ ద్వారా సైబర్ మోసాలపై తన ట్విటర్ అకౌంట్‌లో పలు అలర్ట్‌లు జారీ చేసింది.
సోషల్ మీడియా ఎంత విస్తృతంగా ప్రజల్లో చేతుల్లోకి చేరిపోయిందో..అంతే వేగంగా సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. అందివచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ప్రజల వ్యక్తిగత వివరాలను సంపాదించి ఖాతాల్లో ఉన్న డబ్బులని స్వాహా చేసేస్తున్నారు. ఇంటర్‌నెట్ ప్రపంచంలో దూసుకుపోతున్న కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం పలు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ మోసగాళ్లు సరికొత్త మార్గాలలో అకౌంట్లను ఖాళీ చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదేపదే హెచ్చరిస్తోంది. సైబర్ దోస్త్ ద్వారా సైబర్ మోసాలపై తన ట్విటర్ అకౌంట్‌లో పలు అలర్ట్‌లు జారీ చేసింది.
మొబైల్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్ వాడుతున్న క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లని ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.. పాన్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ ఫోటో వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరితో షేర్ చేయవద్దని సూచించారు. ఆధార్ కార్డ్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్ మొదలైన ముఖ్యమైన సమాచారాన్ని తెలియని వ్యక్తితో షేర్ చేసుకోవద్దని దోస్త్ చెప్పింది. ఇలా మర్చిపోయి కూడా మీ వ్యక్తిగత వివరాలను ఎవ్వరితో షేర్ చేసుకోవద్దని సూచించింది. తెలియని వ్యక్తులతో బ్యాంక్ వివరాలను కూడా షేర్ చేసుకోవద్దు. సోషల్ మీడియాలో వచ్చే లింకులపై ఆలోచించకుండా క్లిక్ చేయవద్దు. మీరు ఏదైనా మోసానికి గురైనట్లయితే వెంటనే మీ బ్యాంక్, సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచండి. లేదంటే వారు మీకు తెలియకుండా ఈ పత్రాలను ఉపయోగించి డూప్లికేట్ సిమ్‌ని తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా మీ అకౌంట్‌లో ఉన్న డబ్బు మొత్తం దోచేస్తారు. అనేక చట్టవిరుద్ధమైన పనులు చేస్తారని సైబర్ దోస్త్ అలర్ట్ చేస్తోంది. ఇకపోతే, సైబర్ దోస్త్ అనేది కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన ట్విటర్ హ్యాండిల్. సైబర్ సెక్యూరిటీ గురించి ఈ హ్యాండిల్‌లో కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కస్టమర్లకు అవగాహన కల్పిస్తుంది. సైబర్ మోసాల బారిన పడొద్దని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.