Mukesh Ambani: 6.5 బిలియన్ డాలర్ల వ్యాపారంపై కన్నేసిన ముకేష్ అంబానీ.. విదేశీ కంపెనీలకు ధీటుగా ఏంచేస్తున్నారంటే..
Mukesh Ambani: రిలయన్స్(Reliance) తన స్వంత 6.5 బిలియన్ డాలర్ల కన్జూమర్ గూడ్స్ వ్యాపారాన్ని నిర్మించడంలో భాగంగా.. డజన్ల కొద్దీ చిన్న గ్రాసరీ, ఆహారేతర వ్యాపారాలను నిర్వహిస్తున్న అనేక బ్రాండ్‌లను కొనుగోలు చేస్తోంది. జియో మార్ట్ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారీ ప్లాన్ చేస్తోంది.
Mukesh Ambani: రిలయన్స్(Reliance) తన స్వంత 6.5 బిలియన్ డాలర్ల కన్జూమర్ గూడ్స్ వ్యాపారాన్ని నిర్మించడంలో భాగంగా.. డజన్ల కొద్దీ చిన్న గ్రాసరీ, ఆహారేతర వ్యాపారాలను నిర్వహిస్తున్న అనేక బ్రాండ్‌లను కొనుగోలు చేయడం ద్వారా హిందుస్థాన్ యునిలివర్‌తో పోటీ పడాలని చూస్తోంది. ఇలా స్వదేశీ వ్యాపార దిగ్గజంగా మారాలని రిలయన్స్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. గత కొంత కాలంగా గమనిస్తే ముకేష్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న రిలయన్స్ కొత్త వ్యాపార ఆలోచనలతో వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది.
ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గడచిన ఆరు నెలల కాలంలో 50 నుంచి 60 గ్రాసరీ, హౌస్ హోల్డ్, పర్సనల్ కేర్ బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటిని మామ్ అండ్ పాప్ స్టోర్స్, పెద్ద రిటైల్‌లకు తీసుకెళ్లడానికి పంపిణీదారుల వ్యవస్ధను నియమించుకుంటోంది. ఈ స్టోర్‌లు రిలయన్స్ రిటైల్ కన్స్యూమర్ బ్రాండ్స్ పేరుతో నిర్వహించబడతాయి. రిలయన్స్ రాబోయే రిటైల్ స్టోర్‌లు ‘జియోమార్ట్’లో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.రిలయన్స్ దాదాపు 30 ప్రసిద్ధ కన్జూమర్ బ్రాండ్‌లను పూర్తిగా కొనుగోలు చేయడానికి జాయింట్ వెంచర్ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి వారితో చర్చలు జరుపుతోంది.
రిలయన్స్ ఐదేళ్లలో తన ఉత్పత్తుల అమ్మకాల ద్వారా 500 బిలియన్ రూపాయల సేల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యాపార వెంచర్ ద్వారా, రిలయన్స్ దశాబ్దాలుగా దేశంలో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్న నెస్లే, యూనిలీవర్, పెప్సికో ఇంక్, కోకాకోలా వంటి ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలతో పోటీ పడాలని చూస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..