AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బ్యాంక్ ఉద్యోగి తప్పిదం.. వేరే ఖాతాలకు రూ.1.50 కోట్లు దళిత బంధు సొమ్ము.. మోదీ డబ్బులిచ్చాడంటూ..

SBI Mistake: తప్పు చేయడం మానవసహజం. పొరపాటున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగి ఇటీవల.. భారీ మొత్తంలో డబ్బును బదిలీ చేసిన ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వ తీసుకొచ్చిన దళిత్ బంధు డబ్బులు పొరపాటున..

Telangana: బ్యాంక్ ఉద్యోగి తప్పిదం.. వేరే ఖాతాలకు రూ.1.50 కోట్లు దళిత బంధు సొమ్ము.. మోదీ డబ్బులిచ్చాడంటూ..
Sbi
Ayyappa Mamidi
|

Updated on: May 15, 2022 | 4:48 PM

Share

SBI Mistake: తప్పు చేయడం మానవసహజం. పొరపాటున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగి ఇటీవల.. భారీ మొత్తంలో డబ్బును బదిలీ చేసిన ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వ తీసుకొచ్చిన దళిత్ బంధు పథకం కోసం కేటాయించిన నిధులను SBI సిబ్బంది పొరపాటున లోటస్ హాస్పిటల్స్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. అయితే.. క్లరికల్ తప్పిదాన్ని బ్యాంక్ సరిదిద్దింది. ఈ తప్పిదం కారణంగా బ్యాంకుకు చాలా చిన్న మెుత్తంలో నష్టం కలిగింది. కానీ ఆ మెుత్తాన్ని రానున్న రోజుల్లో బ్యాంక్ తిరిగి సదరు ఖాతాదారుల నుంచి పొందవచ్చు.

దళిత బంధు పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఒకేసారి మూలధన సాయం అందజేస్తోంది. SC కుటుంబాలకు తగిన ఆదాయాన్ని సృష్టించడానికి 100 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. అయితే.., దళిత బంధు పథకం కింద అర్హులైన కుటుంబాలకు నిధులను బదిలీ చేయడానికి బదులుగా.. SBI ఉద్యోగి పొరపాటున లోటస్ హాస్పిటల్స్‌లోని 15 మంది ఉద్యోగుల శాలరీ అకౌంట్స్ లోకి రూ.1.50 కోట్లు జమ అయ్యాయి.

ఎస్‌బీఐ సిబ్బంది చేసిన క్లరికల్ పొరపాటు కారణంగా 15 మంది ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలు జమయ్యాయి. 15 మంది ఉద్యోగులలో 14 మంది ఇప్పటికే తిరిగి ఆ మెుత్తాన్ని వాపసు ఇచ్చారు. డబ్బు అవసరంలో ఉన్న ఒక ఉద్యోగి మాత్రం.. పొరపాటున తన బ్యాంకు ఖాతాలో జమ అయిన మొత్తంలో కొంత భాగాన్ని ఖర్చు చేశాడు. 10 లక్షలు ప్రధాని నరేంద్ర మోదీ తన బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు మహేష్ అనే ఉద్యోగి భావించాడు. అతను తన అప్పును తీర్చడానికి నిధుల్లో కొంత భాగాన్ని ఉపసంహరించుకున్నాడు. మహేష్ ఖాతాకు పొరపాటున బదిలీ అయిన రూ.10 లక్షల నుంచి రూ.6.70 లక్షలను బ్యాంకు అధికారులు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. నిధులను రికవరీ చేయడానికి బ్యాంక్ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇంకా బ్యాంక్ కు రూ.3.30 లక్షలు తిరిగి రావాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి..

D-Mart: బంపర్ లాభాలను నమోదు చేసిన అవెన్యూ సూపర్ మార్ట్స్.. పెరిగిన స్టోర్ల సంఖ్య..

Car Safety: మీరు కొత్త కారు కొంటున్నారా..? ఈ ఐదు ముఖ్యమైన ఫీచర్స్‌ ఉండాల్సిందే.. వీటి ఉపయోగమేంటో తెలుసుకోండి