AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నటి కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సోదాలు..

కరాటే కల్యాణ్ వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు.

Hyderabad: నటి కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సోదాలు..
Karate Kalyani
Ram Naramaneni
|

Updated on: May 15, 2022 | 6:21 PM

Share

నటి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన ఫైట్ తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. పరస్పర దాడుల నేపథ్యంలో ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆమె అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమె ఇంటికి వెళ్లిన అధికారులు బృందం.. పాప గురించి వివరాలు ఎంక్వైరీ చేస్తుంది.  ఆమె చిన్నారిని చట్టబద్దంగా దత్తత తీసుకుందా అనే విషయంపై ప్రధానంగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అందుకు సంబంధించిన డాక్యూమెంట్స్ వెరిఫై చేస్తున్నారు. కాగా ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గలాటా జరిగినప్పుడు కూడా ఆమెతో పాటు పాప ఉన్న విషయం తెలిసిందే.

సీఐపై కరాటే కల్యాణి ఆరోపణలు….

తనపై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేస్తే..ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి నిందితునికి సపోర్ట్ చేస్తున్నారంటూ  కరాటే కల్యాణి ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులుపై ఫైరయ్యింది. విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులతో గొడవపడడం కరెక్ట్ కాదని స్టేషన్‌ నుంచి ఆమెను బయటకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కల్యాణి సీఐపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానన్నారు. కరాటే కళ్యాణి చేస్తున్న ఆరోపణలపై సీఐ సైదులు స్పందించారు.  చట్ట ప్రకారం సినీనటి కరాటే కళ్యాణి, యూట్యూబ్‌ ఫ్రాంక్‌ స్టార్‌ శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదులను తీసుకుని.. కేసులు నమోదు చేశామన్నారు. కల్యాణి అనవసరంగా ఇష్యూ చేస్తుందని చెప్పారు. ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పుంటే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Follow Us
డాన్స్‌ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
డాన్స్‌ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
యస్తికా భాటియా రికార్డ్ సెంచరీ, 5 వికెట్లతో క్రాంతి గౌడ్ విధ్వంసం
యస్తికా భాటియా రికార్డ్ సెంచరీ, 5 వికెట్లతో క్రాంతి గౌడ్ విధ్వంసం
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెట్ ఫలితాలు
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెట్ ఫలితాలు
ఇంటి నుంచి బయలుదేరే ముందు ఈ చిన్న పని చేస్తే శుభం.. ఇంటికి వచ్చాక
ఇంటి నుంచి బయలుదేరే ముందు ఈ చిన్న పని చేస్తే శుభం.. ఇంటికి వచ్చాక
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్‌
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్‌
పెట్రోల్‌ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..
పెట్రోల్‌ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..
గంటల దొంగ.. దొరికాడు ఇలా..!
గంటల దొంగ.. దొరికాడు ఇలా..!
విపరీతంగా వేడి చేసి మూత్రం సరిగా రానివాళ్ళు ఈ పచ్చడి తింటే చాలు!
విపరీతంగా వేడి చేసి మూత్రం సరిగా రానివాళ్ళు ఈ పచ్చడి తింటే చాలు!
అర్ధరాత్రి వీధుల్లో యువకులు.. దేనికో తెలుసా!
అర్ధరాత్రి వీధుల్లో యువకులు.. దేనికో తెలుసా!
లేటెస్ట్ టీ20 ర్యాంకింగ్స్.. టాప్-10 లో ఏ దేశం ఏ స్థానంలో ఉందంటే
లేటెస్ట్ టీ20 ర్యాంకింగ్స్.. టాప్-10 లో ఏ దేశం ఏ స్థానంలో ఉందంటే