Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Rules: నగదు లావాదేవీలపై కొత్త నిబంధనలు.. లిమిట్ దాటి ట్రాన్సాక్షన్స్ చేస్తే టాక్స్ అధికారుల వద్ద బుక్కైపోతారు.. జాగ్రత్త..

RBI Rules: ఐటీ శాఖ పాన్ కార్డు వాడకాన్ని తప్పనిసరి చేసింది. ఎవరైనా ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహించే సమయంలో పాన్ కలిగి ఉండకపోతే.. దానికి బదులుగా ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు.

RBI Rules: నగదు లావాదేవీలపై కొత్త నిబంధనలు.. లిమిట్ దాటి ట్రాన్సాక్షన్స్ చేస్తే టాక్స్ అధికారుల వద్ద బుక్కైపోతారు.. జాగ్రత్త..
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 15, 2022 | 5:26 PM

RBI Rules: ఐటీ శాఖ పాన్ కార్డు వాడకాన్ని తప్పనిసరి చేసింది. ఎవరైనా ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహించే సమయంలో పాన్ కలిగి ఉండకపోతే.. దానికి బదులుగా ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు. ప్రతి ఖాతాలో నిర్ధేశించిన పరిమితికి మించి డబ్బు జమ చేయడం లేదా విత్‌డ్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇవి మే 26 నుంచి అమలులోకి వస్తున్నాయి. దీంతోపాటు బ్యాంక్ లేదా పోస్టాఫీసులో కరెంట్ అకౌంట్  తెరవడానికి ఈ నిబంధన కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ రెండింటికి ప్రభుత్వం ఆధార్ లేదా పాన్‌ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.

సేవింగ్స్ అకౌంట్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఇకపై రూ. 20 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి లేదా విత్‌డ్రా చేయడానికి ఈ నియమం వర్తిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఈ విషయంపై ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో కరెంట్ అకౌంట్ లేదా నగదు క్రెడిట్ ఖాతాను తెరవడం కూడా అవసరం. దీంతో ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా చేయటం వల్ల పన్ను అధికారులు లావాదేవీలను ట్రాక్ చేయటం చాలా సులువుగా మారుతుందని వారు అంటున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ.. నగదు లావాదేవీలపై ప్రభుత్వం చెక్ పెట్టేందుకు ఇది దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనుమానాస్పద డిపాజిట్లు, విత్ డ్రాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్లను అడ్డుకునేందుకు ఇది దోహదపడుతుందని వారు అంటున్నారు. తాజా నిబంధనల ద్వారా టాక్స్ కట్టకుండా తప్పించుకునే వారికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Telangana: బ్యాంక్ ఉద్యోగి తప్పిదం.. వేరే ఖాతాలకు రూ.1.50 కోట్లు దళిత బంధు సొమ్ము.. మోదీ డబ్బులిచ్చాడంటూ..

D-Mart: బంపర్ లాభాలను నమోదు చేసిన అవెన్యూ సూపర్ మార్ట్స్.. పెరిగిన స్టోర్ల సంఖ్య..