Amazon jobs: 2025 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటున్న అమెజాన్.. వాటిపైనే ఫోకస్..

Amazon jobs: దేశంలో ఇప్పటివరకు 11.6 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించామని ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్​ ఇండియా వెల్లడించింది. ఎగుమతుల విలువను 5 బిలియన్​ డాలర్లకు పెంచడం సహా 40 లక్షలకుపైగా ఎమ్​ఎస్​ఎంఈలను డిజిటలైజ్​ చేశామని పేర్కొంది.

Amazon jobs: 2025 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటున్న అమెజాన్.. వాటిపైనే ఫోకస్..
Amazon
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 15, 2022 | 8:39 PM

Amazon jobs: దేశంలో ఇప్పటివరకు 11.6 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించామని ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్​ ఇండియా వెల్లడించింది. ఎగుమతుల విలువను 5 బిలియన్​ డాలర్లకు పెంచడం సహా 40 లక్షలకుపైగా ఎమ్​ఎస్​ఎంఈలను డిజిటలైజ్​ చేశామని పేర్కొంది. అమెజాన్​ సంభవ్​ పేరుతో 2020 జనవరిలో జరిగిన వార్షికోత్సవంలో.. ‘2025 నాటికి దేశంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాము. అంతేకాదు ఎగుమతులను 10 బిలియన్​ డాలర్లకు, కోటికిపైగా ఎమ్​ఎస్​ఎంఈలను డిజిటలైజ్​ చేస్తామని అమెజాన్​ వాగ్దానం చేసింది.

ఈ క్రమంలో ఆ ప్రకటనకు సంబంధించి ఇప్పటివరకు తాము చేపట్టిన చర్యలపై అమెజాన్​ ఆదివారం వివరాలను వెల్లడించింది. అమెజాన్​ పేర్కొంటున్న 11.6 లక్షల ఉద్యోగాల్లో కొన్ని నేరుగా సంస్థలో పనిచేసేవి కాగా మరికొన్ని దానికి అనుబంధంగా ఉండే రంగాలకు చెందినవి. డెలివరీ, లాజిస్టిక్స్​, రవాణా, ప్యాకేజింగ్​ మొదలైనవి ఈ కోవకు చెందినవే. గతేడాది జరిగిన వార్షికోత్సవంలో అమెజాన్​ సంభవ్​ వెంచర్​ పేరుతో వెంచర్​ క్యాపిటల్​ను కూడా ప్రారంభించింది. సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారించే స్టార్టప్స్​లో పెట్టుబడులు పెడతామని పేర్కొంది. ఇప్పటికే మైగ్లామ్​, ఎం1ఎక్స్​ఛేంజ్​, స్మాల్​ కేస్​ మొదలైన సంస్థల్లో పెట్టుబడి పెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలతో కలిసి పనిచేస్తున్నాము. కాబట్టి భారత్​లో వ్యాపార రంగం వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించే టెక్నాలజీ, టూల్స్​ వంటివి అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని అమెజాన్​ ప్రతినిధి పేర్కొన్నారు. కేవలం గతేడాదిలో అమెజాన్.. ఐటీ, ఈ-కామర్స్​, లాజిస్టిక్స్​, తయారీ, కంటెంట్​ క్రియేషన్, స్కిల్​ డెవలప్మెంట్​ వంటి రంగాల్లో 1,35,000 లక్షల ఉద్యోగాలను సృష్టించింది.

ఇవీ చదవండి..

Flipkart Back to College Sale: స్టూడెంట్స్‌ కోసం ఫ్లిప్‌ కార్ట్‌ బంపరాఫర్‌.. ఈ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్‌లు..

Mundka Fire: 50 మంది ప్రాణాలు కాపాడిన యోధుడు.. ఢిల్లీ ముండ్కా అగ్ని ప్రమాదంలో కీలకంగా మారిన క్రేన్ డ్రైవర్..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే