- Telugu News Photo Gallery Technology photos Flipkart offering discounts on electronic gadgets in flipkart back to college sale
Flipkart Back to College Sale: స్టూడెంట్స్ కోసం ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్.. ఈ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్‌లు..
Flipkart Back to College Sale: వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను ప్రకటించింది. బ్యాక్ టు కాలేజ్ పేరుతో ఈ నెల 14న మొదలైన సేల్ 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆఫర్లపై ఓ లుక్కేయండి..
Updated on: May 15, 2022 | 8:07 PM

వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ తాజాగా బ్యాక్ టు కాలేజ్ పేరుతో సేల్‌ను ప్రారభించింది. ఈ సేల్‌లో భాగంగా పలు రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లను అందించింది.

సేల్‌లో భాగంగా జేబీఎల్, బోట్, రియల్‌మీతో పాటు ఇతర హెడ్ ఫోన్స్, స్పీకర్లపై 70 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే ట్రిమ్మర్‌లపై సేల్‌లో భాగంగా 60 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఇక విద్యార్థులకు ఉపయోగపడే ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. అలాగే కీబోర్డులు, మౌస్‌లు వంటి వాటిని రూ. 149 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు.

గేమింగ్ యాక్ససరీస్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. స్మార్ట్ వాచ్‌లపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.

ఈ ఆఫర్లతో పాటు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అప్పటికప్పుడు 10 శాతం అదనంగా డిస్కౌంట్ అందిస్తున్నారు.





























