AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నీ ఉద్యోగం ఉండాలంటే నేను మీ ఇంటికి రావాలి…! మహిళ ఉద్యోగికి ఎదురైన షాకింగ్‌ సీన్‌

కామాంధులు రెచ్చిపోతున్నారు. మద్యం, మత్తు పదార్థాలకు అలవాటుపడిన కొందరు వ్యక్తులు..ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. పని ప్రదేశాలు, జన సమూహలు, నిర్జన ప్రదేశాలు ఆడవాళ్లు కనబడితే చాలు వెకిలి చేష్టలకు దిగుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మెదక్‌ జిల్లాలో జరిగిన ఓ సంఘటన

Telangana: నీ ఉద్యోగం ఉండాలంటే నేను మీ ఇంటికి రావాలి...! మహిళ ఉద్యోగికి ఎదురైన షాకింగ్‌ సీన్‌
Harassment
Jyothi Gadda
|

Updated on: May 15, 2022 | 5:37 PM

Share

కామాంధులు రెచ్చిపోతున్నారు. మద్యం, మత్తు పదార్థాలకు అలవాటుపడిన కొందరు వ్యక్తులు..ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. పని ప్రదేశాలు, జన సమూహలు, నిర్జన ప్రదేశాలు ఆడవాళ్లు కనబడితే చాలు వెకిలి చేష్టలకు దిగుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మెదక్‌ జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ అవసరాన్ని అవకాశంగా తీసుకున్నాడు ఆమే పై ఆఫీసర్‌… ఆమెకు కావాల్సిన సంతకం పెట్టాలంటే, తనకు కావాల్సింది ఇవ్వాలంటూ ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. ఎన్నిసార్లు సదరు అధికారిని ఆశ్రయించినా పదే పదే అదే వాదన. దాంతో విసుగెత్తిపోయిన బాధితురాలు..ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో విషయం బయటపడింది.

మెదక్‌ జిల్లాకు చెందిన ఓ ఆఫీసర్‌ తన వద్ద పనిచేస్తున్న ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్టుగా బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కాంట్రాక్ట్‌ పద్ధతిన సంక్షేమశాఖలో పనిచేస్తున్న తమను కొనసాగించేలా ఏడాదికోసారి జిల్లా స్థాయిలో అధికారులు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేయాలి. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులు మమ్ముల్ని కొనసాగిస్తారు. ఇదే విషయమై దస్త్రం మీద సంతకం చేయాలని విజ్ఞప్తి చేసేందుకు మరో మహిళా ఉద్యోగితో కలిసి మార్చి 30న కార్యాలయానికి వెళ్లా. అక్కడికి వెళ్లాక… నాతో మాట్లాడుతానని చెప్పి నా సహోద్యోగిని ఆ అధికారి పంపించేశారు. డబ్బు అడుగుతారేమో అనుకున్నా. కానీ ఆయన నోటి నుంచి నేను ఊహించని మాటలు వచ్చాయి. సంతకం పెడతానని, కానీ రేపు ఉదయం ఒకసారి మీ ఇంటికి వస్తా. నా కోరిక తీర్చు అని మాట్లాడాడు. ఒక్కసారిగా నాకేం చేయాలో అర్థం కాలేదు. సర్‌.. మీరు నా తండ్రిలాంటి వారు.. అలా మాట్లాడొద్దు అని బతిమిలాడా. అయినా ఆఫీసుల్లో ఇలాంటివన్నీ మామూలు విషయాలే.. ఇలా ఉంటేనే అన్ని పనులూ జరుగుతాయి.. నువ్వేం కంగారుపడకు అంటూ పదే పదే అలాంటి మాటలతో నన్ను వేధించాడు. ఉన్నతాధికారులు న్యాయం చేయకపోతే ఎంతవరకైనా పోరాడతా’ అని బాధిత మహిళ వెల్లడించింది. పని బిల్లుల విషయంలో ఏడాది కాలంగా ఆ అధికారి బాధితురాలిని వేధిస్తున్నట్టుగా కంప్లైట్‌ లో చెప్పింది. ఇంతకాలం జరిగిందంతా మర్చిపోయి, ఇప్పటికైనా తనతో ఒకరోజు గడపాలని, అలా చేస్తేనే నిన్ను ఉద్యోగంలో కొనసాగించే ఫైల్‌పై సంతకం చేస్తానని ఒత్తిడి చేసినట్టుగా బాధితులు వాపోయింది. తన మాట వింటే నీకు ఏ కష్టం రాకుండా మహరాణిలా చూసుకుంటా. ఉద్యోగ విధులూ పెద్దగా లేకుండా చూస్తా’ అంటూ అధికారి అన్నట్లు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.

అనుచితమైన మాటలు, నేరుగా లేదా స్పష్టంగా లైంగిక పదాలను ఉపయోగించడం, లైంగిక ప్రయోజనాల కోసం బహుమతులు ఇస్తానని చెప్పడం.. వంటివన్నీ లైంగిక వేధింపుల కిందకు వస్తాయి. మాటలు, ప్రవర్తన, చేష్టలు, సైగల ద్వారా సైతం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు కొందరు కామాంధులు. ఆఫీసులో, ఇంట్లో, పాఠశాలల్లో, మందిరాల్లో, వివిధ ప్రదేశాల్లో లైంగిక వేధింపుల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి చర్యలకు చట్టం కఠినమైన శిక్షలు విధిస్తోంది.

Trees Plantation : అమ్మకు ప్రేమతో..పాతికేళ్లనాటి మామిడి చెట్టును కూకటి వేళ్లతో తరలించాడు..ఆ తర్వాత ఏం చేశాడంటే..

US coast: సముద్ర తీరంలో భారీ తిమింగలం కళేబరం…స్థానికుల్ని స్థలం ఖాళీ చేయించిన పోలీసులు..దాని పొట్ట నిండా అవే..!

Mistery village: సైన్స్‌కు సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం.. 12 ఏళ్లుగా అబ్బాయిలే పుట్టని ఊరు..! ఎక్కడంటే..

Nizamabad : ఇదో దయనీయఘటన..ఏడు రోజుల పసికందును సాకలేనంటూ..పోలీసులను ఆశ్రయించిన తండ్రి