Trees Plantation : చనిపోయిన అమ్మకోసం ఓ లాయర్ కొడుకు గిఫ్ట్..పాతికేళ్లనాటి మామిడి చెట్టును కూకటి వేళ్లతో పెకిలించాడు..!
చనిపోయిన తల్లిదండ్రుల మీద ప్రేమతో కొందరు వారికి గుడికట్టి పూజలు చేస్తుంటారు. అందులో అమ్మ,నాన్నల విగ్రహలను ప్రతిష్టించి ధూపదీపారాధనలు జరిపిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు తల్లి మీద ప్రేమతో ఆమె నాటిని మహా వృక్షాన్ని ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించి ...
చనిపోయిన తల్లిదండ్రుల మీద ప్రేమతో కొందరు వారికి గుడికట్టి పూజలు చేస్తుంటారు. అందులో అమ్మ,నాన్నల విగ్రహలను ప్రతిష్టించి ధూపదీపారాధనలు జరిపిస్తుంటారు. మరికొందరు చనిపోయిన భార్య లేదా భర్త విగ్రహలను తయారు చేయించుకుంటారు. తమతోపాటు ఇంట్లోనే తిరుగుతున్నట్టుగా నట్టింట ప్రతిష్టించుకుంటారు. మొన్నా ఆ నడుమ చెన్నైలో ఓ యువతి చనిపోయిన తన సోదరుడి విగ్రహం ఏర్పాటు చేయింది. తన కూతురి ఓణి ఫంక్షన్‌లో ఆ విగ్రహాన్ని భారీ ఊరేగింపుతో తన ఇంటికి తెచ్చుకుంది. అప్పట్లో ఆమే చేసిన ఈ పనికి తమిళనాడుతో పాటు, నెటిజన్లు సైతం ప్రశంసించారు. అన్న చెల్లెలి బంధాన్ని అందరూ కొనియాడారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు తల్లి మీద ప్రేమతో ఆమె నాటిని మహా వృక్షాన్ని ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించి తల్లికి గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు..అర్థం కాలేదు కదా..అక్కడికే అదేంటో వివరంగా తెలుసుకుందాం…
సిద్దిపేట పట్టణం రాఘవేంద్రనగర్ కు చెందిన గన్నమనేని బాలకిషన్ రావు , రాధ దంపతుల కుమారుడు కిరణ్ కుమార్..అతడు హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. రాధ గతేడాది కరోనా బారిన పడి మృతి చెందారు. రాధ మరణానంతరం ఆమేకు సిద్ధిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలోని వారి సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, కిరణ్ కుమార్ తల్లి రాధ 25 ఏళ్ల కిందట ఎంతో ఇష్టంతో ఓ మామిడి మొక్క నాటి సంరక్షించారు. అది ఇప్పుడు మహా వృక్షమైంది. ఫలాలను అందిస్తోంది. దాంతో అతడు ఆ మామిడి చెట్టును తల్లి సమాధి వద్దకు చేర్చాలని నిర్ణయించుకున్నాడు. పాతికేళ్ల క్రితం నాటిన మామిడి వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకిలించి అమ్మను ఖననం చేసిన చోట తిరిగి నాటించాలనుకున్నాడు. అందుకోసం ట్రీస్ ప్లాంటేషన్ విధానాన్ని అనుసరించాడు. మామిడి చెట్టు కొమ్మలను కత్తిరించి యంత్రాల సాయంతో వెలికితీశారు. రాధ అంత్యక్రియలు జరిగిన చోటే ఓ పెద్ద గుంత తవ్వించి అందులో ఆ మామిడి మహా వక్షాన్ని నాటించారు. ఇలా చేయటం వల్ల తన తల్లి ఆత్మకు శాంతి, ఆనందం కలుగుతుందని కిరణ్ కుమార్ అంటున్నాడు.