AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Tips: రూ.లక్ష పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా.. ఈ 5 మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయం డబుల్‌!

Personal Finance: 2026లో మీరు మీ పొదుపు డబ్బులను పెట్టుబడుల్లో పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో డబ్బులు సేవ్ చేయడం అనేది చాలా కష్టం. కానీ మనం భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ సేవింగ్స్ అనేవి చాలా ముఖ్యం. కాబట్టి మీ దగ్గర సేవింగ్స్ ఒక లక్ష రూపాయలు ఉంటే.. వాటిని సరైన విధానంలో పెట్టుబడి పెట్టి .. మంచి రాబడులు పొందేందుకు ఐదు మార్గాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Aug 01, 2026 | 5:11 PM

Share
 ఫిక్స్ డిపాజిట్లు : మీరు ఖచ్చితమైన, ఊహించదగిన రాబడులను కోరుకునే వారు అయితే మీరు ఎఫ్‌డీలు మంచి ఆప్షన్ అవుతాయి. మీరు మీ డబ్బును బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీ లలో కొంతకాలం పాటు ఒకేసారి డిపాజిట్ చేసి స్థిరమైన వడ్డీని పొందవచ్చు. దీనిలో మనకు పెద్దగా రిస్క్ ఉండదు. అలాగే కొన్ని నెలల నుండి సంవత్సరాల వరకు ఎన్ని రోజులైనా మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. వీటిలో మీ పెట్టుబడికి ఏడాదికి 3.5% నుండి 7.5 శాతం వరకు వడ్డీని పొందవచ్చు.

1 / 5
రికరింగ్ డిపాజిట్లు:  ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా, ప్రతినెల కొంత మొత్తాన్ని జమ చేయాలనుకునే వారికి ఈ ఆర్‌డీలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు రూ.1 లక్ష కార్పస్‌ టార్గెట్‌గా పెట్టుకుంటే .. ప్రతినెల క్రమం తప్పకుండా కొంత మొత్తం డిపాజిట్ చేయవచ్చు. ఇందులో కూడా రిస్క్‌ చాలా తక్కువ 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు మీరు ఇందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇందులో కూడా మీకు ఏడాదికి 3.5 టూ 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. వచ్చిన వడ్డీపై మీ ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను వర్తిస్తుంది.

2 / 5
ప్రభుత్వ సెక్యూరిటీలు: కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల సేకరణ కోసం జారీ చేసే బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా కూడా మీరు రాబడులు పొందవచ్చు. జి-సెక్ (G-Sec)లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రభుత్వానికి అప్పు ఇస్తారు. ప్రతిఫలంగా ప్రభుత్వం వడ్డీతో పాటు మీ అసలును తిరిగి చెల్లిస్తుంది. ప్రభుత్వ పూచీకత్తు ఉండటం వల్ల ఇవి చాలా సురక్షితమైనవి. వీటిలో మీరు 91 రోజుల ట్రెజరీ బిల్ల నుండి 40 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీకు ఏడాదికి సుమారు 5.5% నుండి 7.5% వడ్డీ లభిస్తుంది.

3 / 5
కార్పొరేట్ బాండ్లు : కొన్ని కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఇతర అవసరాల కోసం కార్పొరేట్ బాండ్లను జారీ చేస్తాయి. మీరు ఈ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా కంపెనీకి రుణం ఇచ్చి, ప్రతిఫలంగా వడ్డీని పొందుతారు. అయితే ఇందులో కంపెనీ క్రెడిట్ రేటింగ్‌ను బట్టి రిస్క్ మారుతుంది. ఇందులో 1 నుండి 10 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. సంవత్సరానికి సుమారు 7 నుండి 12 శాతం ఇంట్రెస్ట్ వస్తుంది.

4 / 5
బంగారు బాండ్లు: ఆభరణాల కొనుగోలు కాకుండా బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎస్‌జీబీలు చాలా బగా హెల్ప్ అవుతాయి. దీని విలువ మార్కెట్ బంగారు ధరలకు అనుగుణంగా మారుతుంది. దీనికి అదనంగా ప్రభుత్వం ఏటా స్థిర వడ్డీని కూడా ఇస్తుంది. ఇందులో రిస్క్‌ అనేది బంగారం ధరల హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. దీనిలో మీరు 8 సంవత్సరాలు వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన ఐదేళ్ల తర్వాత మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏది సెట్ అవుతుందనే దానిని బట్టి మీరు దేనిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఎంచుకోండి. (note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. దేనిలో అయిన పెట్టుబడి పెట్టే ముందు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి.

5 / 5
Follow Us