AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: కేవలం రూ.50 వేలు ఖర్చు పెడితే చాలు.. నెలకు రూ.60 వేల సంపాదన. ఈ బిజినెస్‌లతో డబ్బే డబ్బు..

వ్యాపారం చేయాలంటే లక్షలు అక్కర్లేదు. కేవలం రూ.50 వేలు ఉంటే చాలు.. మంచి వ్యాపారం స్టార్ట్ చేసి నెలకు రూ.50 వేల వరకు పొందవచ్చు. తక్కువ బడ్జెట్‌లో స్టార్ట్ చేయగలిగే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో 5 వ్యాపారాల గురించి తెలుసుకుందాం.

Business Ideas: కేవలం రూ.50 వేలు ఖర్చు పెడితే చాలు.. నెలకు రూ.60 వేల సంపాదన. ఈ బిజినెస్‌లతో డబ్బే డబ్బు..
Business Ideas
Venkatrao Lella
|

Updated on: Aug 01, 2026 | 9:11 PM

Share

వ్యాపారం అంటే లక్షలు, కోట్లతో కూడుకున్న పని అని చాలామంది పొరపాటు పడుతుంటారు. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లక్షలు, కోట్లు అవసరం లేదు. తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టగలిగే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. మీ దగ్గర రూ.50 వేలు ఉన్నా మంచి వ్యాపారం ప్రారంభించి అధిక ఆదాయం పొందవచ్చు. సరైన ప్లానింగ్ తెలివి, హార్డ్ వర్డ్ చేసే తత్వం ఉంటే బాగా డబ్బులు సంపాదించవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేసిన తక్కువ సమయంలోనే డబ్బులు మీ చేతిలోకి వస్తాయి. రూ.50 వేలలో మొదలుపెట్టగలిగే ఐదు బెస్ట్ బిజినెస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హోమ్ ఫుడ్ బిజినెస్

ఫుడ్ బిజినెస్ చేయాలంటే రూమ్ అవసరం లేదు. కేవలం మీ వంటిట్లోనే ఆహార పదార్ధాలు వండి విక్రయించవచ్చు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులకు మీరు విక్రయించి డబ్బులు సంపాదించవచ్చు. రోజుకు మీరు 30 నుంచి 50 మందికి అందించినా నెలకు రూ.60 వేల వరకు సంపాదించవచ్చు. ఖర్చులు పోను మీకు రూ.30 వేల వరకు మిగులుతాయి. అయితే కిరాణా సరుకులకు రూ.15 వేలు, ప్యాకింగ్ మెటీరియల్స్‌కు రూ.10 వేలు, డెలివరీ రూ.15 వేలు ఖర్చు అవుతుంది. ఇక వంట పాత్రలకు రూ.10 వేలు అవుతుంది. రూ.50 వేల ఖర్చుతో మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేయవచ్చు.

ఇక మొబైల్ యాక్సెసరీస్ విక్రయం

మొబైల్ ఛార్జర్లు, ఇయర్ ఫోన్లు, పవర్ బ్యాంక్, టెంపర్డ్ గ్లాస్ వంటివి విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఎక్కువగా విక్రయాలు జరిగితే నెలకు రూ.25 నుంచి రూ.40 వేల వరకు మీరు సంపాదించవచ్చు. స్టాక్ ఖర్చు రూ.35 వేలు, షెల్ప్ రూ.10 వేలు, ప్రచారానికి రూ.5 వేలు ఖర్చు అవుతుంది.

ప్రింటింగ్, జిరాక్స్

జారాక్స్, లామినేషన్, కలర్ ప్రింట్, స్పైరల్ బైండింగ్ వంటి వాటి ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు. స్కూల్స్, కాలేజీలు, ఆఫీసుల దగ్గర మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయి. నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదించవచ్చు. ప్రింటర్‌కు రూ.20 వేలు, కంప్యూటర్ రూ.20 వేలు, పేపర్, ఇంక్ రూ.10 వేలు ఖర్చు అవుతుంది.

నేచురల్ ప్రొడక్ట్స్ అమ్మకం

రాగి పిండి, కారం పొడి, సజ్జ పిండి, పసుపు, ఆర్గానిక్ బెల్లం, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వంటి వాటివి విక్రయించే ఆదాయ పొందవచ్చు. నెలకు రూ.50 వేల వరకు సంపాదించవచ్చు. వస్తువుల కొనుగోలు కోసం రూ.35 వేలు, ప్యాకింగ్‌కు రూ.10 వేలు, బ్రాండింగ్‌కు రూ.5 వేలు ఖర్చు అవుతుంది.

సోషల్ మీడియా మేనేజ్‌మెంట్

సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. పోస్టులు, రీల్స్, పోస్టర్ డీజైన్, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్, YouTube థంబ్‌నెయిల్ డిజైన్ వంటివి చేసి ఆదాయం పొందవచ్చు.

Follow Us