AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ENG: చచ్చాం రోయ్.! మ్యాచ్ దొబ్బడానికి ఆ రెండు ఓవర్లు గ్యారంటీనట.. ఇక దేవుడే కాపాడాలి..

భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ ముందు కోచ్ మోర్ని మోర్కెల్ అభిషేక్ శర్మ, శివమ్ దూబేల గురించి మాట్లాడాడు. అభిషేక్ ఫామ్‌లోకి వస్తాడని ధీమా వ్యక్తం చేయగా, శివమ్ దూబే బౌలింగ్ మెరుగుపరచుకుంటున్నాడని అన్నారు. అయితే, శివమ్ దూబేకు బౌలింగ్ ఇవ్వొద్దని అభిమానులు కోరుతున్నారు.

IND Vs ENG: చచ్చాం రోయ్.! మ్యాచ్ దొబ్బడానికి ఆ రెండు ఓవర్లు గ్యారంటీనట.. ఇక దేవుడే కాపాడాలి..
Team India
Ravi Kiran
|

Updated on: Mar 05, 2026 | 12:10 PM

Share

ఇంగ్లాండ్‌తో వాంఖడే వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌తో టీం ఇండియా సిద్ధమవుతున్న వేళ, భారత బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ కీలక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జట్టులోని కీలక ఆటగాళ్ల ఫామ్‌పై, ముఖ్యంగా అభిషేక్ శర్మ, శివమ్ దూబేల ప్రదర్శనపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. బ్యాటింగ్‌లో యువ సంచలనం అభిషేక్ శర్మ అద్భుతంగా పుంజుకుంటాడని మోర్ని మోర్కెల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు కొన్నిసార్లు గేమ్ కష్టంగా అనిపిస్తుందని, గతంలో సంజు శాంసన్ కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడని, ఇప్పుడు అతను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని గుర్తు చేశాడు. అదేవిధంగా అభిషేక్ శర్మ కూడా మెరుగుపడతాడని మోర్కెల్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అభిషేక్ తన అడుగును బలంగా వేశాడని, టీ20 వరల్డ్ కప్‌లో క్రమంగా ఇబ్బంది పడటం సహజమేనని, ఇవన్నీ అనుభవ పాఠాలని ఆయన వివరించారు. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో మళ్లీ అభిషేక్ ఫామ్‌ను చూడబోతున్నామని, రెండు బౌండరీలు కొట్టగలిగితే రిథమ్ అందుకున్నట్టేనని, అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.

ఇక ఆల్ రౌండర్ శివమ్ దూబే బౌలింగ్ ఫామ్‌పై కూడా మోర్ని మోర్కెల్ మాట్లాడారు. దూబే బౌలింగ్ ఫామ్ కోల్పోయాడని తాను అనుకోవడం లేదని, అతనికి గేమ్ పై పూర్తి అవగాహన ఉందని మార్కెల్ స్పష్టం చేశారు. కొన్ని డెలివరీలు ఇంకాస్త అత్యుత్తమంగా ఉండాలేమో అనిపిస్తుందని, ఫామ్ ప్రకారం అయితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. తప్పకుండా శివమ్ దూబే నుంచి ఒకటి లేదా రెండు ఓవర్లు వేయించే అవకాశం ఉందని మోర్కెల్ సూచించారు. బౌలింగ్‌లో మెరుగుపడాల్సిన వాటిపై ఇప్పటికే దృష్టి పెట్టామని, ఒకసారి లైన్ అందుకుంటే ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేయగలడని మోర్ని మోర్కెల్ వెల్లడించారు.

అయితే, శివమ్ దూబే బౌలింగ్ విషయంలో టీం ఇండియా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దూబే చేత బౌలింగ్ చేయిస్తే గెలిచే మ్యాచ్ కూడా ఓడిపోవచ్చని, కీలకమైన ఈ మ్యాచ్‌లో ఆ పని చేయవద్దని అభిమానులు, విశ్లేషకులు అభ్యర్థిస్తున్నారు. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లలో దూబే ఎంత ఘోరమైన బౌలింగ్ వేశాడో చూశామని వారు గుర్తు చేస్తున్నారు. కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి చేత బౌలింగ్ చేయించలేదని, అందుకే టీమిండియా గెలిచిందని, టార్గెట్ కూడా 200 దాటలేదని అభిమానులు అంటున్నారు.

ఇది చదవండి: సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా అతిపెద్ద రెండు గండాలు

Follow Us
డయాబెటిస్, అధిక బరువును ఇట్టే తగ్గించే సూపర్‌ఫుడ్..
డయాబెటిస్, అధిక బరువును ఇట్టే తగ్గించే సూపర్‌ఫుడ్..
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్