AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadarsha Kutumbam: అజిత్, సూర్యల సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు వెంకీమామ కూతురిగా.. ఈ నటి ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో విక్టరీ- వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరి కాంబోలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీ శ్వరి వంటి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ వచ్చాయి. ఇప్పుడిదే కాంబినేషన్ లో రాబోతోన్న మరో సినిమా 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (ఏకే 47).

Basha Shek
|

Updated on: Jul 29, 2026 | 7:32 PM

Share

1 / 7
 హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో విక్టరీ వెంకటేష్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే యువినా పార్థవి, నివేదా పేతురాజ్, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు వివిధ పాత్రల్లో నటిస్తున్నారు.

2 / 7
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఆదర్శ కుటుంబం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ వరుసగా గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా వెంకటేష్ కూతురు  సంపూర్ణ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ బుధవారం ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో తన క్యూట్ యాక్టింగ్, డైలాగ్స్ తో అందరిని ఆకట్టుకుంది యువీనా పార్థవి

3 / 7
 ఈ నేపథ్యంలో ఆదర్శకుటుంబం సినిమాలో వెంకటేష్ కి కూతురుగా నటిస్తున్న ఈ యువీనా పార్థవి ఎవరా? అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ యువీనా పార్థవి చెన్నైలో సెటిలైన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక తమిళ్ సినిమల్లో నటించింది.

4 / 7
 2013 లో తిరుమతి తమిజ్ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది యువీనా పార్థవి.
ఆ తర్వాత వీరం, అరణ్మయి, కత్తి, కాకి, పుష్పక విమాన, సర్కార్.. ఇలా దాదాపు 25 తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిందీ అందాల తార.

2013 లో తిరుమతి తమిజ్ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది యువీనా పార్థవి. ఆ తర్వాత వీరం, అరణ్మయి, కత్తి, కాకి, పుష్పక విమాన, సర్కార్.. ఇలా దాదాపు 25 తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిందీ అందాల తార.

5 / 7
 అలాగే  'కాకి' అనే ఓ తెలుగు సినిమాలో కూడా నటించింది యువినా. ఇప్పుడు సహాయక నటిగా, హీరోలు, హీరోయిన్ల కూతురు పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ ముద్దుగుమ్మ. అలా ఇప్పుడు త్రివిక్రమ్ - వెంకటేష్ ఆదర్శ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చింది యువీనా.

6 / 7
 ఇక సోషల్ మీడియాలోనూ యువీనాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి జోరు చూస్తుంటే త్వరలోనే హీరోయిన్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

7 / 7
Follow Us