AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా సివిల్ పోలీసు, ఆర్మ్డ్ రిజర్వ్ (AR), స్పెషల్ పోలీసు, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, పరీక్షల షెడ్యూల్ తదితర పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
Telangana Police Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 29, 2026 | 8:11 PM

Share

హైదరాబాద్, జులై 29: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రేవంత్‌ సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి బుధవారం (జులై 29) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. వీటి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 7,437 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్ పోలీసు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్ (AR), స్పెషల్ పోలీసు, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.

ఏయే పోస్టులున్నాయంటే..

  • సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పోస్టులు (సివిల్) 148
  • రిజర్వ్‌ ఎస్‌ఐ పోస్టులు 14
  • రిజర్వ్‌ ఎస్‌ఐ (TGSP) పోస్టులు 12
  • రిజర్వ్‌ ఎస్‌ఐ (SARCPL) పోస్టులు 3
  • అసిస్టెంట్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పోస్టులు (FPB) 23
  • పోలీస్ కానిస్టేబుల్‌ పోస్టులు(Civil)
  • పోలీస్ కానిస్టేబుల్‌ పోస్టులు (AR)
  • పోలీస్ కానిస్టేబుల్‌ పోస్టులు (SARCPL)
  • పోలీస్ కానిస్టేబుల్‌ పోస్టులు (డ్రైవర్‌) (PTO)
  • పోలీస్ కానిస్టేబుల్‌ పోస్టులు (మెకానిక్‌) (PTO)
  • ఎస్సై పోస్టులు 44
  • కానిస్టేబుల్‌ పోస్టులు 1380
  • స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్ పోస్టులు 39
  • ఫైర్‌ ఫైటర్ పోస్టులు 751
  • డిప్యూటీ జైలర్‌ (పురుషులు) పోస్టులు 14
  • డిప్యూటీ జైలర్‌ (మహిళలు) పోస్టులు 1
  • వార్డెన్‌ (పురుషులు) పోస్టులు 196
  • వార్డెన్‌ (మహిళలు) పోస్టులు 12

ఈ నోటిఫికేషన్‌తో పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వేలాది మంది అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. త్వరలో అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, పరీక్షల షెడ్యూల్ తదితర పూర్తి వివరాలను పోలీసు నియామక మండలి వెల్లడించనుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి, అర్హతలు నిర్ధారించుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర