AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న లేడీ ఆటో డ్రైవర్.. ఆరా తీయగా షాకింగ్‌ ట్విస్ట్!

బెంగళూరులో ఓ యువతి తన మంచి జీతం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలి రాపిడో ఆటో డ్రైవర్‌గా మారింది. తండ్రి మరణం తర్వాత తల్లిని ఒంటరిగా వదిలి రాత్రి షిఫ్టులకు వెళ్లడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తల్లితో ఎక్కువ సమయం గడపడంతో పాటు, ఐటీ ఉద్యోగంలో కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని ఆమె చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న లేడీ ఆటో డ్రైవర్.. ఆరా తీయగా షాకింగ్‌ ట్విస్ట్!
Bengaluru Woman Inspiring Life Journey
Srilakshmi C
|

Updated on: Sep 29, 2026 | 4:33 PM

Share

బెంగళూరు, సెప్టెంబర్ 29: ఐటీ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది బెంగళూరుకు వస్తుంటారు. మంచి జీతం, మెరుగైన కెరీర్ కోసం కార్పొరేట్ కొలువులను ఆశ్రయిస్తారు. అయితే ఓ యువతి మాత్రం మంచి జీతం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారింది. ఇందుకు కారణం తెలుసుకున్న నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ తన్వి శెట్టి బెంగళూరులో రాపిడో ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ యువతిని కలిశారు. ఆటో నడుపుతున్న యువతి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటంతో తన్వి ఆశ్చర్యపోయారు. ఆమె గురించి తెలుసుకునేందుకు మాట్లాడగా, తన జీవిత ప్రయాణానికి సంబంధించిన విషయాలను యువతి వెల్లడించింది. ఆ యువతి గతంలో ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే తండ్రి మరణం తర్వాత కుటుంబ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగంలో రాత్రి షిఫ్టులు ఉండటంతో తన తల్లిని రాత్రివేళ ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. తన తల్లి భద్రత, సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆమె.. చివరకు కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసింది.

ఇవి కూడా చదవండి

కుటుంబం వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు.. ఐటీ ఉద్యోగం కంటే ఇదే బెటర్‌

ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో నడపాలన్న ఆమె నిర్ణయాన్ని మొదట కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ‘బాగా చదువుకున్న అమ్మాయి ఆటో నడపడం ఏంటి? సమాజం ఏమనుకుంటుంది?’ అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే యువతి మాత్రం ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా తనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుంది. ఆటో నడపడం ద్వారా తన తల్లితో ఎక్కువ సమయం గడపగలుగుతున్నానని ఆమె చెప్పింది. అంతేకాదు, ఐటీ ఉద్యోగంలో సంపాదించిన దానికంటే ప్రస్తుతం ఎక్కువ ఆదాయం వస్తోందని తెలిపింది.

View this post on Instagram

A post shared by Tanvi👑 (@the_tanvishetty)

తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు స్వయం సమృద్ధిగా జీవించేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన తల్లి కోసం కార్పొరేట్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని, స్వతంత్రంగా జీవితం కొనసాగిస్తున్న యువతి ధైర్యాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీగా స్పందన లభిస్తోంది.

Follow Us
ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? ఏర్పాటు చేసే విధానం..
ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? ఏర్పాటు చేసే విధానం..
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ద్వారకాతిరుమల..
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ద్వారకాతిరుమల..
మహిళల ప్రీమియర్ లీగ్ వేలానికి ముహూర్తం ఫిక్స్.. వేదిక, సమయం ఇదే
మహిళల ప్రీమియర్ లీగ్ వేలానికి ముహూర్తం ఫిక్స్.. వేదిక, సమయం ఇదే
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా.. రుచి అదిరిపోతుంది!
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా.. రుచి అదిరిపోతుంది!
'నేను పుట్టాను.. అలసిపోయాను..' బేబీ పోజ్ కు నెట్టింట ఫిదా
'నేను పుట్టాను.. అలసిపోయాను..' బేబీ పోజ్ కు నెట్టింట ఫిదా
ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు సగానికి తగ్గుతుంది!
ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు సగానికి తగ్గుతుంది!
ఈ జ్యూస్‌ ఆరోగ్యానికి అమృతమే..! అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..
ఈ జ్యూస్‌ ఆరోగ్యానికి అమృతమే..! అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..
పచ్చి కొబ్బరితో 5 నిమిషాల్లోనే కమ్మని జున్ను.. తింటే మళ్లీ మళ్లీ
పచ్చి కొబ్బరితో 5 నిమిషాల్లోనే కమ్మని జున్ను.. తింటే మళ్లీ మళ్లీ
ఆంధ్రా స్టైల్ గోంగూర పులావ్.. పుల్లపుల్లని రుచితో ఇంట్లోనే ఈజీగా
ఆంధ్రా స్టైల్ గోంగూర పులావ్.. పుల్లపుల్లని రుచితో ఇంట్లోనే ఈజీగా
రికార్డ్ టైమింగ్‎తో దుమ్ములేపిన తెలుగమ్మాయి
రికార్డ్ టైమింగ్‎తో దుమ్ములేపిన తెలుగమ్మాయి