AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ వ్యక్తిత్వాన్ని చూసి ఎవరైనా ఫిదా కావాల్సిందే! ఎదుటివారిని ఇంప్రెస్ చేసే సైకాలజీ ట్రిక్స్

ఇతరులను ఆకట్టుకునే వ్యక్తిత్వం ఒక్కరోజులో ఏర్పడదు. అయితే మాట్లాడే ముందు కొన్ని సైకాలజీ ట్రిక్స్ పాటించడం ద్వారా సెకన్ల వ్యవధిలోనే ఎదుటి వారికి ఇంప్రెస్ చేసేయొచ్చు. కొన్ని చిన్న అలవాట్లు మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడంలో సహాయపడతాయి. కేవలం 7 సెకన్ల వ్యవధిలోనే ఈ ట్రిక్స్‌తో ఎదుటివారిని ఇంప్రెస్ చేయడం సాధ్యమే. మరి ఆ సైకాలజీ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మీ వ్యక్తిత్వాన్ని చూసి ఎవరైనా ఫిదా కావాల్సిందే! ఎదుటివారిని ఇంప్రెస్ చేసే సైకాలజీ ట్రిక్స్
Personal GrowthImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Sep 30, 2026 | 12:52 PM

Share

ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు మన గురించి వారికి ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. మన మాట తీరు, బాడీ లాంగ్వేజ్, కళ్లలోకి చూస్తూ మాట్లాడటం, స్పందించే విధానం.. ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని ఎదుటివారికి పరిచయం చేస్తాయి. అందుకే మొదటి పరిచయంలోనే మంచి ఇంప్రెషన్ ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఇతరులను ఆకట్టుకునే వ్యక్తిత్వం కొంతమందికి మాత్రమే సహజంగా వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న అలవాట్లను నిరంతరం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం సాధ్యమే. ముఖ్యంగా ఈ 3 సైకాలజీ టిప్స్ ఉపయోగపడతాయి.

సమాధానం చెప్పే ముందు ఒక్క సెకన్ ఆగండి

ఎవరైనా మనల్ని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పాలని చాలామంది ప్రయత్నిస్తారు. ముఖ్యంగా టెన్షన్‌లో ఉన్నప్పుడు వేగంగా మాట్లాడటం మొదలుపెడతారు. అలా కాకుండా ప్రశ్న విన్న తర్వాత ఒక సెకన్ ఆగి, ఆ తర్వాత ప్రశాంతంగా సమాధానం ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఈ చిన్న విరామం మీలో ఆత్మవిశ్వాసం, ఆలోచించి మాట్లాడే లక్షణం ఉన్నట్లు ఎదుటివారికి అనిపించేలా చేస్తుంది.

ఎదుటివారి భావాలను అర్థం చేసుకోండి

కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వెంటనే మన అభిప్రాయాలను చెప్పడం కంటే ముందుగా వారి మాట తీరును, పరిస్థితిని అర్థం చేసుకోవడం మంచిది. ఎదుటివారు ప్రశాంతంగా మాట్లాడుతుంటే మనం కూడా అదే స్థాయిలో మాట్లాడాలి. వారు సీరియస్‌గా ఉన్న సమయంలో సరదాగా వ్యవహరించడం లేదా చాలా గట్టిగా మాట్లాడటం వారికి ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ముందుగా ఎదుటివారి భావాలను గమనించి, దానికి అనుగుణంగా మన కమ్యూనికేషన్‌ను మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మనపై వారిలో నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మాట్లాడే వేగాన్ని తగ్గించండి

టెన్షన్‌లో ఉన్నప్పుడు చాలామంది చాలా వేగంగా మాట్లాడుతుంటారు. దీనివల్ల మన మాట స్పష్టంగా వినిపించకపోవడంతో పాటు, మనలో ఆతురత ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అందుకే ముఖ్యమైన సందర్భాల్లో కొంచెం నెమ్మదిగా, స్పష్టంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఎదుటివారి కళ్లలోకి చూస్తూ, అవసరమైన చోట చిన్న విరామాలు ఇస్తూ మాట్లాడితే మీ మాటలకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది.

బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ముఖ్యం

కేవలం మాటలతోనే వ్యక్తిత్వాన్ని చూపించలేము. ముఖ కవళికలు, కళ్లలోకి చూడటం, నిలబడే విధానం, చేతుల కదలికలు వంటి బాడీ లాంగ్వేజ్ కూడా మనపై ఏర్పడే అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే కొత్త వ్యక్తులను కలిసినప్పుడు తొందరపడకుండా, ప్రశాంతంగా ఉండటం, చిరునవ్వుతో పలకరించడం, శ్రద్ధగా వినడం వంటి చిన్న విషయాలను పాటించండి.

Follow Us