విదుర నీతి: ఈ 4 గుణాలు ఉన్న వ్యక్తిని ఎవరూ అవమానించలేరు.. మీలో ఉన్నాయా?

30 September 2026

Rajashekher

విదుర నీతి ప్రకారం కోపం, కోరికలు, మాటలు, ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండటం గొప్ప గుణం. ఆత్మనిగ్రహం ఉన్న వ్యక్తి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తాడు.

ఆత్మనిగ్రహమే నిజమైన బలం

కోపంలో తీసుకునే నిర్ణయాలు తరచూ సమస్యలకు దారితీస్తాయి. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆలోచించి మాట్లాడటం, ప్రశాంతంగా స్పందించడం ముఖ్యమని విదుర నీతి చెబుతుంది.

కోపాన్ని అదుపులో ఉంచుకోవడం

నిజమైన జ్ఞానం పుస్తకాల ద్వారా మాత్రమే కాకుండా జీవిత అనుభవం, ఆచరణ, పరిస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా కూడా వస్తుంది. అలాంటి జ్ఞానం ఉన్న వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుంది.

జ్ఞానం – పుస్తకాలకు మాత్రమే..

జ్ఞానం ఉన్న వ్యక్తి ప్రతి విషయాన్ని ఆలోచించి, తార్కికంగా నిర్ణయం తీసుకుంటాడు. తొందరపడకుండా ప్రశాంతంగా మాట్లాడటం వల్ల ఇతరుల గౌరవాన్ని కూడా పొందుతాడు.

వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం

జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకుని ముందుకు సాగేందుకు సహనం ఎంతో అవసరం. కష్ట సమయాల్లో కంగారుపడకుండా స్థిరంగా ఉండేవారే సమస్యలను సమర్థంగా ఎదుర్కోగలరని విదుర నీతి సూచిస్తుంది.

సహనం – కష్టాల్లోనూ స్థిరంగా ఉండటం

గొప్ప లక్ష్యాలను సాధించడానికి సమయం, పట్టుదల అవసరం. సహనం లేని వ్యక్తి తొందరపాటు నిర్ణయాలతో తనకే నష్టం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఓర్పు విజయానికి పునాది

ధనం, అధికారం కంటే మంచి శీలాని(వ్యక్తిత్వం)కే ఎక్కువ విలువ ఉందని విదుర నీతి చెబుతుంది. మంచి ప్రవర్తన, నిజాయితీ, నైతిక విలువలు కలిగిన వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుంది.

శీలం – వ్యక్తి నిజమైన సంపద

వ్యక్తి ధనవంతుడైనా, పేదవాడైనా అతని శీలమే అతని నిజమైన గుర్తింపుగా నిలుస్తుంది. మంచి స్వభావం, నైతిక విలువలు ఉన్న వ్యక్తిని ఇతరులు సులభంగా అవమానించలేరనే భావన విదుర నీతిలో కనిపిస్తుంది.

మంచి శీలం శాశ్వత..