AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రోజు వర్షాలు కొనసాగనున్నాయి. గురువారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Shaik Madar Saheb
|

Updated on: Jul 29, 2026 | 8:11 PM

Share
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాపై తీవ్రవాయుగుండం కదులుతుందని, ఇది రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్ - మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటి ప్రభావంతో గురువారం మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షం పడే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

1 / 5
గురువారం (30-07-2026)  పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి,  కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా ,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మర్కాపురం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

2 / 5
ఇక తెలంగాణలో సైతం వర్షాలు కురుస్తున్నాయి.. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

3 / 5
గురువారం అదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

4 / 5
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని అధికారులు సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు . అలలు ఉధృతంగా ఉన్నప్పుడు చిన్నబోట్లు వినియోగించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

5 / 5
Follow Us