Vitamin D: ‘విటమిన్ డి’ అధికంగా తీసుకుంటున్నారా.. అయితే ఈ వ్యాధుల బారిన పడినట్లే..

అవసరమైన దానికంటే ఎక్కువ విటమిన్ డి తీసుకుంటే శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకోసం డాక్టర్ సలహాలు తీసుకుంటూ, క్రమ పద్ధతిలో విటమిడ్ డిని తీసుకోవాలి.

Vitamin D: 'విటమిన్ డి' అధికంగా తీసుకుంటున్నారా.. అయితే ఈ వ్యాధుల బారిన పడినట్లే..
Vitamin D
Follow us
Venkata Chari

|

Updated on: May 16, 2022 | 5:58 PM

శరీరం సజావుగా పని చేయాలంటే అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు అవసరమని మనందరికీ తెలిసిందే. ఈ విటమిన్లలో డి-విటమిన్(Vitamin D) కూడా ఒకటి. ఆరోగ్యాన్ని కాపాడడంలో విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి శరీరం కాల్షియంను బాగా గ్రహించడంలో సహాయపడటమే కాకుండా, కండరాలు, కణాల పెరుగుదలకు, శరీర వ్యవస్థ నిర్వహణ, రోగనిరోధక(Immunity Power) వ్యవస్థకు కూడా ఇది చాలా అవసరం. విటమిన్-డికి అతిపెద్ద వనరులలో ఒకటి సూర్య కిరణాలు. ఇది కాకుండా, ప్రజలు కొన్ని ఆహారాలు, సప్లిమెంట్ల ద్వారా కూడా విటమిన్ డి పొందుతుంటారు. అయినప్పటికీ, మీరు నిరంతరం విటమిన్-డి సప్లిమెంట్లను తీసుకుంటే, అది శరీరంలో అధికమయ్యే పరిస్థితికి దారితీస్తుంది. విటమిన్-డి అధికంగా ఉండటం వల్ల కూడా అనేక సమస్యలు(Health) వస్తాయి. శరీరంలో విటమిన్-డి అధికంగా ఉన్నప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పొట్ట సమస్యలు..

మీరు నిరంతరం విటమిన్-డిని ఎక్కువగా తీసుకుంటే, దాని ప్రభావం మీ జీర్ణవ్యవస్థపై కనిపిస్తుంది. నిజానికి, విటమిన్-డి తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయి పెరుగుతుంది. అధిక కాల్షియం ఫలితంగా మీరు కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, వాంతులు, మలబద్ధకం లేదా అతిసారం సంభవించవచ్చు. ఈ స్థితిలో కొందరికి తరచుగా మూత్ర విసర్జన సమస్య కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అలసినట్లు అనిపించడం..

మీ శరీరంలో విటమిన్-డి అధికంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండలేరు. తరచుగా వాంతులు, విరేచనాలు లేదా మలబద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు నిరంతరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. అలాంటి వారికి ఏ పనీ చేయాలని అనిపించకపోవడంతో పాటు వారి శరీరంలో చెప్పుకోదగ్గ ఉత్సాహం లేదా శక్తి లేన్నట్లు కనిపిస్తుంది.

విటమిన్-డి అధికంగా ఉండటం వల్ల తరచుగా గందరగోళం ఏర్పడుతుంది. ఎప్పుడూ ఏదోఒక గందరగోళంలో ఉంటుంటారు. దీంతో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఇది అధిక కాల్షియం స్థాయిల వల్ల కూడా కనిపిస్తుంది. ఇది విటమిన్-డి అధిక మోతాదులకు దారి తీస్తుంది.

అధిక దాహం..

శరీరంలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. దీని కారణంగా చాలా దాహం వేస్తుంది. ఇందుకోసం తరచుగా నీరు తాగొచ్చు. కానీ, అప్పటికీ మీ దాహం తీరదు.

కాల్షియం అధికమవడం..

శరీరంలో విటమిన్ డి అధికంగా ఉందనడానికి ఇదే అతి పెద్ద సంకేతం. నిజానికి, విటమిన్ D విధుల్లో ఒకటి శరీరంలో కాల్షియంను గ్రహించడం. కానీ, మీరు విటమిన్ డిని అధికంగా తీసుకుంటే, అది శరీరంలో కాల్షియంను డిపాజిట్ చేయడం ప్రారంభిస్తుంది. కాల్షియం నిక్షేపాలు మీ శరీరంలోని ఏ భాగానైనా ఉండొచ్చు. అంతేకాదు క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు.

కిడ్నీపై ప్రభావం..

విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారితీయవచ్చు. ఎందుకంటే శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉండటం వల్ల కాల్షియం అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మూత్రవిసర్జన, మూత్రపిండాలు కాల్సిఫికేషన్ ద్వారా నీటిని కోల్పోయేలా చేస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విటమిన్ డి లోపం వల్ల కిడ్నీలు కూడా పాడవుతాయి.

జాగ్రతగా చూసుకోవాలి..

విటమిన్ డి అధిక మోతాదు సాధారణంగా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల వస్తుంది. దీనికి కారణం ఆహారం లేదా సూర్యరశ్మి మాత్రమే కాదు. ఎందుకంటే మీ శరీరం సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి చేయబడిన విటమిన్ డి మొత్తాన్ని నియంత్రిస్తుంది. బలవర్థకమైన ఆహారాలలో కూడా అధిక మొత్తంలో విటమిన్ డి ఉండదు. అందువల్ల, మీరు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకుంటే, ఎల్లప్పుడూ నిపుణుల సలహాపై మాత్రమే తీసుకోవాలి. అలాగే, దాని మోతాదుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న చిట్కాలు, వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే అందించా. నివారణ చర్యలు / చికిత్సను అనుసరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Health Care: ఈ పదార్థాలు తినగానే అలర్జీలు అవుతున్నాయా..? జాగ్రత్త..

Eyes Health Tips: మీరు ఎక్కువ సేపు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా..? మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి