AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eyes Health Tips: మీరు ఎక్కువ సేపు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా..? మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

Eyes Health Tips: కంప్యూటర్ వాడకం అనేది నేటి రోజుల్లో ఇది సర్వసాధారణమయిపోయింది. కంప్యూటర్ (Computer) లేనిదే రోజు గడవని పరిస్థితి ఉంది. చిన్న చిన్న ఉద్యోగులు కూడా..

Eyes Health Tips: మీరు ఎక్కువ సేపు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా..? మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
Subhash Goud
|

Updated on: May 16, 2022 | 8:39 AM

Share

Eyes Health Tips: కంప్యూటర్ వాడకం అనేది నేటి రోజుల్లో ఇది సర్వసాధారణమయిపోయింది. కంప్యూటర్ (Computer) లేనిదే రోజు గడవని పరిస్థితి ఉంది. చిన్న చిన్న ఉద్యోగులు కూడా కంప్యూటర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంకా సాఫ్ట్ వేర్ వర్క్ చేస్తున్న వాళ్లయితే రోజులో ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవాల్సి ఉంటుంది. కేవలం సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కాకుండా చాలా మందికి కంప్యూటర్ చూడడం తప్పడం లేదు. అలా ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ ను చూడడం వలన మన కళ్ల మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది. మన కళ్ల మీద ఒత్తిడిని తగ్గించుకోవడం పలు చిట్కాలు పాటిస్తే ఎంతో మేలంటున్నారు కంటి వైద్య నిపుణులు.

కరోనా వచ్చిన నాటి నుంచి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అందుబాటులోకి వచ్చింది. ఇక ఆఫీసుల కంటే వర్క్‌ఫ్రంహోమ్‌లోనే ఎక్కువ సేపు కంప్యూటర్ల ముందు గడపాల్సి వస్తోంది. కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు గడపడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. అదే పనిగా కంప్యూటర్ స్ర్కీన్ ను చూడడం వలన మన కళ్లు అలసిపోతాయి. అందుకే మధ్య మధ్యలో కొంత సేపు బ్రేక్ ఇవ్వడం మంచిది. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉన్నవాళ్లు వర్క్ లో ఉంటూనే మధ్యాహ్న భోజనం పూర్తి చేసుకోవాలి. తర్వాత లంచ్ టైం గంట సేపు కాస్త రిలాక్స్ గా పడుకోవాలి. ఇలా చేయడం వలన మన కళ్లు రిఫ్రెష్ అవుతాయి.

కంప్యూటర్ల ముందు కూర్చోని వర్క్‌ చేసే వాళ్లు కళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. కంప్యూటర్‌ను పదేపదే చూడకుండా మధ్య మధ్యలో అటు ఇటు చూస్తూ, కనురెప్పలను కదిలిస్తూ ఉండాలి. రోజుకు ప్రతి ఒక్కరూ ఎనిమిది గంటల సేపు రిలాక్స్ గా పడుకోవాలి. అలాంటపుడే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

గంటల తరబడి కంప్యూటర్ల ముందు పని చేస్తూ ఉంటాం. దీంతో కళ్లు అలసటకు గురవుతాయి, పొడి బారతాయి. ఇలాంటి అలసిన కళ్లు సేద తీరాలంటే రోజుకు ఒక్కసారైనా ఐ వర్కవుట్‌ సాధన చేస్తూ ఉండాలి. ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కంప్యూటర్‌ తెరమీద నుంచి పక్కకి తిరిగి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుల వైపు ఇరవై సెకన్ల పాటు కనురెప్పలు కొడుతూ ఉండాలి. దీని వళ్ల కళ్లలో నీళ్లు ఉత్పత్తి అవుతాయి. ఎక్కువ సేపు ఒకే తెరని చూడటం వల్ల కళ్లలో తడి తగ్గిపోతుంది. ఇది తగ్గితే కంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి ఇరవై నిమిషాలకోసారి కుర్చీలోంచి లేచి కొద్దిసేపు నడిచి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. మీ కళ్ళు ఒత్తిడిగా ఉన్నాయని భావిస్తే చల్లటి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లపై ఒత్తిడిని దూరం చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి