Curd Benefits: సమ్మర్‌లో పెరుగు సర్వరోగ నివారిణి.. మరి ఎప్పుడు ఎలా తినాలో తెలుసా..!
పెరుగు ఆరోగ్యానికి దివ్యౌషధం. స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. జీర్ణవ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు ఇతర జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే..
పెరుగు ఆరోగ్యానికి దివ్యౌషధం. స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. జీర్ణవ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు ఇతర జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే.. మనిషి శరీరానికి అనేక రకాలుగా పెరుగు అవసరం. పాలలో కంటే ఎక్కువ కాల్షియం కలిగి ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది. ఇది కాకుండా, విటమిన్లు, ఖనిజాలు కూడా పెరుగులో పెద్ద పుష్కలంగా ఉంటాయి. మరి ఇన్ని ప్రయోజనాలు శరీరానికి అందాలంటే ఆ పెరుగును ఏ సమయంలో ఎంత మోతాదులో తినాలి? రోజుకు ఎన్నిసార్లు తినాలి? అనే విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..డైటీషియన్ల ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో పెరుగు తినడం జీర్ణక్రియకు ఎంతో మంచిది. ఎందుకంటే పెరుగు జలుబు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే రాత్రిపూట తీసుకుంటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే పెరుగును మధ్యాహ్నం తీసుకోవాలి. అయితే ఎక్కువ మోతాదులో పెరుగు తీసుకోకూడదట.. తాజా పెరుగును ఒక మీడియం సైజు గిన్నెడు మధ్యాహ్నం తినడం ఉత్తమం అంటున్నారు. ఇంకో ముఖ్య విషయం ఫ్రిజ్ లో ఉంచిన పెరుగును తినకపోవడమే మంచిదంటున్నారు. ఊబకాయాన్ని తగ్గించడంలో పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుందట. పెరుగు కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధించడమే కాకుండా ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయట. నోటిపూత, అల్సర్లను కూడా పెరుగు తగ్గిస్తుందట. పెరుగు ముఖం, జుట్టు అందాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. చుండ్రును తొలగిస్తుంది. పెరుగలో ముల్తానీ మిట్టి కలిపి రాసుకుంటే ముఖానికి మంచి ప్యాక్‌లా పనిచేస్తుందట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: పెళ్లిలో వధువు కునుకుపాట్లు.! పాప.. పెళ్లి నీదే అంటున్న నెటిజన్లు..
Nap At Office: హాయిగా ఆఫీసులోనే నిద్రపోవచ్చు..! ఇది కంపెనీ ఆఫర్..! మీరేమంటారు మరి..!
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..