Mangoes: మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.!
వేసవి వస్తోందంటే ఆహ్లాదకరమైన రంగు, రుచితో పాటు, ఎన్నో పోషకవిలువలతో అలరించే మామిడిపండు కోసం ఎదురుచూడని వారు ఉండరు. అయితే మామిడి పండ్లను తిన్న తర్వాత కొన్ని ఆహార్థ పదార్థాలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అవెంటో తెలుసుకుందాం.
Mango Eating Mistakes:వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి నోరూరించే మామిడి పండ్ల వైపు మళ్ళుతుంది. పండ్లకు రారాజు.. మామిడి పండు. మామిడి పండు.. భారతదేశపు జాతీయ ఫలం. మన దేశంలో పండే మామిడి పండ్లకు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక ఆదరణ ఉంది. బంగిన పల్లి, కలెక్టర్, అరటి మామిడి, సువర్ణ రేఖ, నీలాలు, చెరకురసం, చిన్న రసం, పెద్ద రసం ఇలా అనేక మామిడి రకాలున్నాయి. మామిడి పండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. మామిడిపండులో ఫైబర్ మన జీర్ణవ్యవస్థను కాపాడడమే కాక, బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. అయితే మామిడి పండ్లను తిన్న తర్వాత ఈ ఐదు ఆహార పదార్థాలను తీసుకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..