Health Care: ఈ పదార్థాలు తినగానే అలర్జీలు అవుతున్నాయా..? జాగ్రత్త..

Food Allergy: ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే అలర్జీలు వస్తుంటాయి. ప్రకృతిలో దొరికే ప్రతి ఆహారం..

Health Care: ఈ పదార్థాలు తినగానే అలర్జీలు అవుతున్నాయా..? జాగ్రత్త..
Follow us
Subhash Goud

|

Updated on: May 16, 2022 | 12:04 PM

Food Allergy: ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే అలర్జీలు వస్తుంటాయి. ప్రకృతిలో దొరికే ప్రతి ఆహారం ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. అయితే ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం. అందులోనూ కొందరికి కొన్ని ఆహార పదార్థాలు పడవు. వాటి వల్ల రకరకాల అలర్జీలకు గురవుతారు. అలాంటివారు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.

  1. గోధుమలు: బలవర్ధకమైన ఆహారం. కానీ వీటిలోని గ్లూటెన్‌ కారణంగా కొందరిలో అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్లూటెన్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అధిక బరువు, జీర్ణ సమస్యలు వస్తుంటాయని చెబుతున్నారు.
  2. సీఫుడ్‌: చేపలు, రొయ్యలు, నత్తల వంటి సముద్రపు ఆహారం శరీరానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అయితే వీటిలోని కొన్ని పదార్థాలు కొందరికి పడవు. అలర్జీలు కలిగిస్తాయి. అలాంటి వారు వీటికి దూరంగా ఉండటం మంచిది.
  3. సోయా: ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. శాకాహారుల మాంసంగా కూడా పేరుంది. అయితే దీనిలోనూ చర్మ సంబంధ సమస్యలు కలిగించే రసాయనాలు ఉన్నాయంటారు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
  4. నట్స్‌: బాదం, కాజు, పైన్‌ నట్స్‌, వాల్‌నట్స్‌.. వంటివి తినడం వల్ల కొందరికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పీనట్‌ బటర్‌, చీజ్‌ కూడా వీరికి పడకపోవచ్చు. అలాంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది.
  5. గుడ్లు: శరీరానికి కావలసిన అన్ని పోషకాలనూ అందిస్తాయి. అయితే, గుడ్లు కొందరికి అలర్జీ కలిగిస్తాయి. ఫుడ్‌ ఎలర్జీలకు కారణమయ్యే ఆహార పదార్థాల్లో రెండో స్థానం గుడ్లదే. గుడ్లలో ఎన్నో పోషకాలు ఉన్నా.. కొందరికి అలర్జీ కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కొన్ని ఆహారాలు తిన్న తర్వాత అలర్జీ వస్తుంటుంది. కొందరు కొన్ని ఆహారాలు పచ్చిగా తిన్నా.. వండిన తర్వాత తిన్నా అలర్జీ వస్తుంటుంది. కొందరు వ్యక్తులు పచ్చి లేదా వండని పండ్లు, కూరగాయలను తిన్న తర్వాత నోరు, గొంతు దురద వస్తుంటుంది. అయితే ఆహారాన్ని వేడి చేయడం ద్వారా అలెర్జీ కారకం నాశనమవుతుంది. తర్వాత ఎటువంటి సమస్య లేకుండా తినవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఎక్కువ కాలం పాటు ఏమైనా ఆహార పదార్థాలు తీసుకోకుండా ఒకేసారి తినడం వల్ల కూడా ఎలర్జీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల కూడా ఎలర్జీ వస్తుంది. కొంత మందిలో అయితే స్పెసిఫిక్ గా ఈ అలర్జీ ఉంటుంది ఉదాహరణకు పచ్చి పల్లీలు తిన్నప్పుడు ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సాల్ట్ వేసుకుని తినడం వల్ల ఎలర్జీ రాకపోవచ్చు. ఇలా కొందరిలో స్పెసిఫిక్ ఎలర్జీలు ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే