AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lotus Benefits: బురదలో వికసించే తామరపువ్వుతో మైండ్ బ్లాంక్ అయ్యే బెనిఫిట్స్.. కనీసం మీరు ఊహించలేరు

Lotus Flower Benefits: తామర పువ్వు బురదలో వికసిస్తుంది. తామర పువ్వు చెరువు లేదా సరస్సు అందాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగించబడుతుందని చాలా మంది భావిస్తారు. తామర పువ్వు అనేక ఔషధ ఉపయోగాలతో నిండి ఉంది. ఈ పువ్వులో మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచే పెట్టె దాగి ఉంది. ఈ పువ్వులోని ప్రతి భాగం ఆరోగ్యానికి ఏదో ఒక విధంగా ఉపయోగకరంగా ఉంటుంది.

Surya Kala

|

Updated on: May 16, 2022 | 1:59 PM

మట్టిలో తామర పువ్వు వికసిస్తుంది. దీని అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అతి తక్కువమందికి మాత్రమే తెలుసు. తామర పువ్వులో ఒత్తిడి ,టెన్షన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రోజు తామర పువ్వు ఏయే ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది.. ఎలా ఉపయోగించవచ్చో  తెలుసుకుందాం.

1 / 6
ఈ పువ్వుని చైనా సాంప్రదాయ వైద్యంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు. లోటస్ లీఫ్ టీ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.

2 / 6
లోటస్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి నొప్పి నివారిణిగా పనిచేస్థాయి.శరీరంలో ఎక్కడైనా నొప్పి కలిగి ఉంటే.. తామర  నూనెతో మసాజ్ చేయవచ్చు. ఎముకల నొప్పిని కూడా తగ్గిస్తుంది. దీనితో పాటు, ఇది పాత గాయం నొప్పిని కూడా తొలగిస్తుంది.

3 / 6
తామరపువ్వులోని చల్లదనం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. దీనితో పాటు, ఇది శరీర ఉష్ణోగ్రత, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రోజూ తామరపువ్వుని ఉపయోగిస్తుంటే.. ఫీల్-గుడ్ హార్మోన్లు కూడా పెరుగుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి.  మంచి నిద్ర పొందడానికి సహాయపడతాయి. డిప్రెషన్‌లో ఉన్నవారి తామరపువ్వు ప్రభావవంతమైన ఔషధం అని చెబుతున్నారు.

4 / 6
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలా మంది జుట్టు తెల్లబడటం, ఊడిపోవడం, పొడిబారడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరికి తామర పువ్వు మంచి ఔషధం. ఈ పువ్వుతో తయారుచేసిన నూనెను రోజూ తలకు మర్దన చేయండి. దీనివలన  జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ, దృఢంగా పెరుగుతుంది.

5 / 6
 లోటస్ ఫ్లవర్‌ టీ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ టీ తయారీ కోసం ముందుగా తామర పువ్వును తీసుకోండి. అనంతరం ఒక పాత్రలో నీరు, యాలకులు మరిగించాలి. రుచి కోసం చక్కెర, టీ ఆకులను జోడించండి. అనంతరం కొన్ని తామర పువ్వు రేకులను వేసి.. ఈ మిశ్రమాన్ని మరిగించండి. ఈ మిశ్రమామ్ మరిగించిన అనంతరం అందులో పాలు వేయాలి. బాగా మరిగించిన తామరపువ్వుని టీని వడకట్టి తాగండి. ఇలా రెగ్యులర్ చేయడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిని వైద్య సలహాలు సూచనలతోనే పాటించాల్సి ఉంటుంది.

6 / 6
Follow us