AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అర్థరాత్రి వరకు చిందులేసిన వరుడు.. కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వధువు..

మే 15న హర్యానాలోని శివాని వార్డు నంబర్ 10కి చెందిన అనిల్ అనే వ్యక్తి మంజు అనే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఊరేగింపుతో రాజ్‌గఢ్‌లోని చెలానా బాస్ వద్దకు చేరుకున్నాడు.బరాత్‌లో జరిగిన ఆలస్యం వల్ల..

Viral: అర్థరాత్రి వరకు చిందులేసిన వరుడు.. కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వధువు..
Viral News
Venkata Chari
|

Updated on: May 17, 2022 | 8:13 PM

Share

ఓ వివాహ వేడుకలో వరుడు తన స్నేహితులతో కలిసి అర్థరాత్రి వరకు డ్యాన్స్ చేయడంతో కోపోద్రిక్తులైన వధువు కుటుంబం, కూతురికి వేరే అబ్బాయితో పెళ్లి చేసి షాక్ ఇచ్చారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని చురులో జరిగింది. ఆ తర్వాత నూతన వధూవరుల ఊరేగింపును చూసి నొరెళ్లబెడుతూ తిరిగి వెళ్లారు. పెళ్లి ముహూర్తం ముగిసిపోవడంతో వరుడి కోసం వధువు గంటల తరబడి ఎదురుచూసి, చిర్రెత్తుకొచి వధువు కుటుంబ సభ్యులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్‌లోని చురులో ఓ వరుడు పెళ్లి సందర్భంగా గంటల తరబడి హల్‌చల్ చేయడం, డ్యాన్స్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయంగా మారింది. వరుడి కోసం ఎదురుచూసిన వధువు.. స్నేహితులతో కలిసి వరుడు డ్యాన్స్ చేయడంతో అర్థరాత్రి వరకు పెళ్లి వేదికను చేరుకోలేకపోయాడు. దీంతో మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. వధువు కుటుంబం ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీని తర్వాత వరుడు పెళ్లి చేసుకోకుండానే తిరిగి రావాల్సి వచ్చింది.

Also Read: Watch Video: ఓడియన్ స్మిత్ దెబ్బకు పేకమేడలా కూలిన పంజాబ్ టీం.. ఫన్నీ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

కాగా ఊరేగింపుగా వస్తోన్న వరుడు, అతని స్నేహితుల అల్లరిని చూసిన వధువుతోపాటు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి. అయితే, వరుడి తరుపు వారు శాంతికపోవడంతో మీ ఇష్టమెచ్చినట్లు చేసుకోమ్మని వధువు తరుపు వారు వరుడు కుటుంబానికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, తీరా వరుడు కుటుంబం తమ బరాత్‌ను పూర్తి చేసుకుని, పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ జరిగిన సీన్‌ను చూసి షాక్ అయ్యారు. ఈ విషయమై వరుడి తరపు వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 15న హర్యానాలోని శివాని వార్డు నంబర్ 10కి చెందిన అనిల్ అనే వ్యక్తి మంజు అనే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఊరేగింపుతో రాజ్‌గఢ్‌లోని చెలానా బాస్ వద్దకు చేరుకున్నాడు. దీంతో బరాత్‌లో జరిగిన ఆలస్యం వల్ల ఇరు వర్గాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఊరేగింపు జరిగిందని, పెళ్లికూతురు ఇంటికి చేరుకోవడానికి దాదాపు 150 మంది డీజే ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఊరేగింపులో ఎంతగా మునిగిపోయారంటే, రాత్రి 2 గంటల వరకు వరుడు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో వధువు వరుడి కోసం వేచి చూస్తోంది.

ఇవి కూడా చదవండి

తెల్లవారుజామున 2 గంటల వరకు వరుడు మంటపం వద్దకు రాకపోవడంతో వివాహ కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి. దీంతో వధువు తరపు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పెళ్లికూతురు తరపు వారు డ్యాన్సులను ఆపేయాలని కోరడంతో గొడవ జరిగింది. మరోవైపు శుభ ముహూర్తం రాత్రి 1:15 గంటలకు ముగిసింది. ఎన్నిసార్లు విన్నవించినా వరుడు సకాలంలో రాకపోవడంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులు మరో అబ్బాయితో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అదే మంటపంలో రాత్రి వధువు బంధువులు వధువుకు మరో అబ్బాయితో పెళ్లి జరిపించారు. దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.

Also Read: Viral: నయా ట్రెండ్… ప్రీ షష్టిపూర్తి షూట్‌ !! నెట్టింట వైరల్‌

Digital News Round Up: ప్రభాస్‌తో మరోసారి అనూష్క | కవల గిత్తలకు బర్త్‌డే వేడుక..లైవ్ వీడియో