Health Tips: జంక్ ఫుడ్ అదేపనిగా తింటున్నారా..? అయితే వీటిని కూడా తప్పనిసరిగా తీసుకోండి.. ఎందుకంటే..?

Body Detox Tips: ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే.. శరీరాన్ని నిర్విషీకరణ ( Body Detox Tips ) చేయడానికి సరైన మార్గాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

Health Tips: జంక్ ఫుడ్ అదేపనిగా తింటున్నారా..? అయితే వీటిని కూడా తప్పనిసరిగా తీసుకోండి.. ఎందుకంటే..?
Junk Food
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 17, 2022 | 7:19 PM

Eat these things after eating junk food: ఆధునిక ప్రపంచంలో చాలా మంది జంక్ ఫుడ్ లేదా స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. బిజీ లైఫ్, సమయం లేకపోవడం వల్ల చాలా మంది వీటివైపే మొగ్గు చూపుతున్నారు. అటువంటి పరిస్థితిలో.. మీ శరీరం డిటాక్స్ చేయడం తప్పనిసరని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే జంక్ ఫుడ్ ఉదరానికి సంబంధించిన సమస్యలను సృష్టిస్తుంది. దానితో పాటు చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే.. శరీరాన్ని నిర్విషీకరణ ( Body Detox Tips ) చేయడానికి సరైన మార్గాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. శరీరాన్ని డిటాక్స్ చేయడం వల్ల మీ పొట్ట నిర్వహణ చక్కగా ఉంటుంది. దీంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో జంక్ ఫుడ్ తిన్న తర్వాత శరీరాన్ని ఎలా డిటాక్స్ చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..

బాడీ డిటాక్స్ ఇలా చేసుకోండి..

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లను తప్పనిసరిగా తీసుకోండి. మీ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి సిట్రస్ పండ్లు మంచిగా తినాలి. నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు లాంటివి తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు ఆహారంలో ఎక్కువ పండ్లు చేర్చుకోవడానికి ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి

శరీరం హైడ్రేట్‌గా ఉంచుకోవాలి: శరీరం హైడ్రేట్‌గా ఉండాలంటే రోజంతా ఎక్కువగా నీరు తాగాలి. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీనితో పాటు ఇది అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను తొలగించడానికి మీరు తప్పనిసరిగా నీటిని తాగాలి. దీంతోపాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాన్ని కూడా తీసుకోవచ్చు.

ఆల్కహాల్ – స్వీట్లకు దూరంగా ఉండండి: ఆల్కహాల్, తీపి పదార్థాలను తీసుకోవడాన్ని ఖచ్చితంగా నివారించండి. ఇవి కిడ్నీపై చెడు ప్రభావం చూపుతాయి. ఆల్కహాల్ ఎంత హానికరమో మనందరికీ తెలిసిందే. దీంతోపాటు స్వీట్లు తినడాన్ని, టీ లేదా కాఫీని తాగడాన్ని క్రమంగా నియంత్రించుకోవాలి. ముఖ్యంగా శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి స్వీట్లకు దూరంగా ఉండండి.

వ్యాయామం: వ్యాయామం సహాయంతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శరీరాన్ని సహజంగా డిటాక్స్ చేయడానికి వ్యాయామం చాలా ముఖ్యం. తేలికపాటి వ్యాయామాల సహాయంతో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు. వ్యాయమం మధ్యలో శరీరానికి విశ్రాంతి కలిగించండి. మొదట 30 నిమిషాలతో ప్రారంభించి, ఆపై క్రమంగా సమయాన్ని పెంచండి. శరీరం ఫిట్‌గా ఉండటానికి, డిటాక్స్ చేయడానికి వ్యాయామం ఉత్తమ మార్గం.