Garlic Benefits: సమ్మర్ డైట్‌లో వెల్లుల్లి కచ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..?
వెల్లుల్లి రుచిని అందరూ ఇష్టపడుతారు. కానీ దాని వాసనని మాత్రం కొంతమంది ఇష్టపడరు. ఎందుకంటే దీనిని తిన్న తర్వాత నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అయితే దానిని వదిలించుకోవడానికి చిట్కాలు ఉన్నాయి. కానీ..
వెల్లుల్లి రుచిని అందరూ ఇష్టపడుతారు. కానీ దాని వాసనని మాత్రం కొంతమంది ఇష్టపడరు. ఎందుకంటే దీనిని తిన్న తర్వాత నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అయితే దానిని వదిలించుకోవడానికి చిట్కాలు ఉన్నాయి. కానీ వెల్లుల్లి తినడం మానేస్తే శరీరానికి మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలం వెల్లుల్లిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.సీజనల్ ఇన్ఫెక్షన్లన్నింటినీ నివారించడంలో వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి బలంగా తయారవడమే కాకుండా సీజనల్ వ్యాధులకి దూరంగా ఉంటారు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మకాంతిని పెంచుతాయి. వెల్లుల్లి మీ చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.అలాగే వెల్లుల్లి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తపోటు ఉన్నవారు వెల్లుల్లిని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. వెల్లుల్లి తినడం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అయి ఒత్తిడి తగ్గుతుందట. అంతేకాదు వెల్లుల్లి జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుందట. అందుకు వెల్లుల్లి రెబ్బలను పేస్టులా చేసి పెరుగు లేదా తేనెలో కలిపి జుట్టుకి రాస్తే మంచి ఫలితం ఉంటుందట.వెల్లుల్లిలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలను సైతం తొలగించడానికి సహాయపడుతాయట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..