Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరబ్బాయిలు కొట్టుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రేమ కోసం మానవులే కాదు.. జంతువులు కూడా పోటీ పడతాయని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. అవును మీరు విన్నది నిజం. ఓ ఆడ పులిని మెప్పించడం
ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరబ్బాయిలు కొట్టుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రేమ కోసం మానవులే కాదు.. జంతువులు కూడా పోటీ పడతాయని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. అవును మీరు విన్నది నిజం. ఓ ఆడ పులిని మెప్పించడం కోసం రెండు పులులు బీభత్సంగా పోట్లాడుకున్నాయి. వాటి పోరు చూస్తే గుండెలదిరిపోవాల్సిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు పర్యాటకులు అడవిలో సఫారీలో పర్యటిస్తూ జంతువులను చూస్తున్నారు. ఇంతలో రోడ్డు మధ్య నుంచి రెండు పులులు నడుచుకుంటూ వెళ్తున్నాయి. రోడ్డుకు అవతలి వైపున ఓ ఆడ పులి నిల్చుని ఉంది. దానిని గమనించిన ఈ రెండు పులులు.. ఉన్నట్లుండి గొడవపడ్డాయి. రెండు పులులు తమ పంజాలతో విరుచుకుపడ్డాయి. అత్యంత భీకరంగా పోట్లాడుకున్నాయి. అప్పటి వరకు సన్నిహితంగా ఉన్న పులులు.. ఒక్కసారిగా ఒకదానిపై మరొకటి విరుచుకుపడటం చూసి పర్యాటకులు సైతం హడలిపోయారు. మరోవైపు ఈ రెండు పులులు పోట్లాడుకుంటుంటే.. పక్కనే ఉన్న ఆడ పులి.. ఎవరు గెలిస్తే వాడే నా హీరో అన్నట్టుగా ప్రశాంతంగా చూస్తూ.. వాటి ఫైటింగ్‌ను ఆస్వాదించింది. ఇక ఈ రెండు పులులు చాలాసేపు పోట్లాడుకున్న తరువాత ఒక పులి వెనక్కి తగ్గింది. ఈ వీడియోను ఐఎస్ఎఫ్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను వేలమంది వీక్షిస్తూ లైక్స్‌తో, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

