Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

ఓ వృద్ధుడు తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు.. తన ప్రేమ శాశ్వతం అంటూ భార్య మృత దేహంతో దాదాపు 21 ఏళ్ళు జీవించాడు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తన భార్యకు తుది వీడ్కోలు పలికాడు.

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

|

Updated on: May 13, 2022 | 9:33 PM

ఓ వృద్ధుడు తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు.. తన ప్రేమ శాశ్వతం అంటూ భార్య మృత దేహంతో దాదాపు 21 ఏళ్ళు జీవించాడు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తన భార్యకు తుది వీడ్కోలు పలికాడు. భార్య మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఈ షాకింగ్‌ ఘటన థాయిల్యాండ్ లో చోటు చేసుకుంది. థాయ్‌ల్యాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు చెందిన విశ్రాంత సైనికాధికారి చార్న్ జన్వాచకల్ భార్య అనారోగ్యంతో 20 ఏళ్ల క్రితం మరణించింది. అయితే అప్పటి నుంచి భార్య మృతదేహాన్ని శవపేటికలో ఉంచి ఇంటిలోనే భద్రంగా దాచుకున్నాడు. రోజూ అతను తన భార్య మృత దేహంతో మాట్లాడుతుండేవాడు. ఇప్పుడు జన్వాచకల్ వయసు 72 ఏళ్ళు.. దీంతో తన భార్య మృత దేహాన్ని ఇక భద్రపరచలేనని భావించిన అతడు.. చివరకు అంత్యక్రియలు నిర్వహించాడు. భార్య దహన సంస్కారాలు చేయడానికి ఫెట్ కాసెమ్ బ్యాంకాక్ ఫౌండేషన్ నుండి సహాయం తీసుకుని కర్మకాండ పూర్తి చేశాడు. అంతటితో ఊరుకోలేదు. చితాభస్మాన్ని ఓ కలశంలో ఉంచి ఇంటికి తీసుకుపోయాడు. తాను బతికి ఉన్నంత వరకు అది తనతోనే ఉంటుందని అంటున్నాడు. ఈ దహన సంస్కారాల ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఓ న్యాయవాది జన్వాచకల్ ను సందర్శించి ఇంటర్వ్యూ చేశారు. అతను తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి జీవించేవాడని.. అయితే ఆమె మరణించినప్పుడు ఆమె మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకోవడంతో అతని కుమారులు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారని న్యాయవాది తెలిపారు. చార్న్ జన్వాచకల్ రాయల్ థాయ్ ఆర్మీలో వైద్యుడిగా విధుల నిర్వహించడానికి ముందు.. యూనివర్శిటీలోని ఫార్మసీ ఫ్యాకల్టీ గా పనిచేసేవారట. ఇక అతని భార్య ప్రజారోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేసినట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.
హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.
Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.
తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.
వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు
వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు