Funny Viral video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!
భానుడి ప్రతాపంతో దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి చాలదన్నట్లు బొగ్గు కొరతతో చాలా రాష్ట్రాల్లో 2 నుంచి 8 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో ...
భానుడి ప్రతాపంతో దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి చాలదన్నట్లు బొగ్గు కొరతతో చాలా రాష్ట్రాల్లో 2 నుంచి 8 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు ప్రజలు. ఈక్రమంలో కరెంట్ బాధలు, వేసవి వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈక్రమంలో చల్లదనం కోసం ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరెంట్ పోయిందేమో పాపం ఆ వ్యక్తి తన చేతులతో ఎలక్ట్రిక్ టేబుల్ ఫ్యాన్‌కు ఉండే రెక్కలను వీలైనంత గట్టిగా తిప్పి మంచంపై పడుకుంటాడు. ఫ్యాన్ ఆగిపోయిన తర్వాత లేచి మళ్లీ రెక్కలను తిప్పి మళ్లీ బెడ్‌పైకి వాలుతున్నాడు..కరెంట్ వచ్చేంత వరకు..అతడు అలాగే చేస్తుంటాడు..ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ..దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోతో పాటు ‘ఈ టెక్నిక్ భారతదేశాన్ని దాటి బయటకు వెళ్లకూడదు’ అని రాసిపెట్టిన సరదాగా క్యాప్షన్ నెటిజన్లను తెగ నవ్విస్తుంది. వీడియో చూసిన వారందరూ తెగ నవ్వుకుంటున్నారు. నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

