Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అయితే.. కొన్ని వీడియోలు చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. తాజాగా

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

|

Updated on: May 09, 2022 | 9:42 AM


సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అయితే.. కొన్ని వీడియోలు చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వాస్తవానికి.. తనిఖీ జరిపే ప్రాంతానికి సంబంధించిన CCTV ఫుటేజ్ ఇది. అయితే.. ఇలాంటి భద్రతా తనిఖీ ఇంతకు ముందెన్నడూ చూడలేదంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.ఇక్కడ ఓ వ్యక్తి భద్రతా తనిఖీ ద్వారా అతను వెళ్ళవలసిన కార్యాలయంలోకి ప్రవేశించాడు..అయితే.. అతను ప్రవేశించిన వెంటనే సెక్యూరిటీ గార్డు ఆ వ్యక్తిని తన బ్యాగ్‌ను స్కానర్‌లో వేయాలని తిరిగి వెనక్కి పంపాడు. అయితే.. అతడు తన బ్యాగ్‌ని స్కానర్‌లో పెట్టాలి. కానీ.. ఆ వ్యక్తి డైరెక్ట్‌గా స్కానర్ మీదకు వెక్కి లోపల నుంచి వస్తాడు. స్కానర్‌లో సామానుతో పాటు, ఈ వ్యక్తి స్వయంగా కూర్చొని ముందుకు రావడం చూసి అంతా అవాక్కయ్యారు. అతను బయటకు రాగానే సెక్యూరిటీ గార్డు కూడా షాక్ అవుతాడు. తలపై రెండు చేతులు పెట్టుకుని ఇదేంటి రా..? నాయనా అనుకుంటూ ఆశ్చర్యంగా ఫేస్‌పెట్టాడు.. సెక్యూరిటీ గార్డు ఎక్స్‌ప్రెషన్ చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు. దీన్ని చూసి నవ్వు ఆగడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియోకు ఫన్నీ రియాక్షన్స్‌తో పాటు యూజర్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Follow us