Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…
ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ యువ జంట వివాహం విచిత్రంగా ఊహించని విధంగా జరిగింది. పెళ్లి కోసం మండపానికి బయల్దేరిన వధూవరులు..
ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ యువ జంట వివాహం విచిత్రంగా ఊహించని విధంగా జరిగింది. పెళ్లి కోసం మండపానికి బయల్దేరిన వధూవరులు మార్గమధ్యలోనే అనుకోకుండా పెళ్లి చేసేసుకున్నారు. అది కూడా విమానం జరిగింది వీరి వివాహం..అవును మీరు విన్నది, చూస్తున్నది నిజమేనండోయ్..నిజంగానే ఈ జంట పెళ్లి ఫ్లైట్‌లో జరిగింది. అమెరికాలోని ఓక్లహోమాకు చెందిన సల్దా, ప్యాటర్‌సన్ అనే జంట లాస్ వెగాస్‌కి వెళ్లే విమానంలో ఒకటయ్యారు. ఏప్రిల్ 24న వీరు వేగాస్‌లోని ఓ ప్రార్థన మందిరంలో పెళ్లి చేసుకోవాలని అన్ని ఏర్పాటు చేసుకున్నారు. మూహూర్త టైమ్‌కు అక్కడకు చేరుకునేందుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు.. అంతా పెళ్లికి రెడి అయ్యారు. వధూవరులు సైతం పెళ్లి దుస్తుల్లో బయల్దేరారు…కానీ, సడెన్‌గా వారి కనెక్టింగ్ ఫ్లైట్ రద్దు అయింది. దాంతో సల్దా, ప్యాటర్‌సన్‌లు, వారి కుటుంబ సభ్యులు గందరగోళంలో పడ్డారు. వేగాస్‌కు సమయానికి ఎలా చేరుకోవాలో అర్థంకాక ఆందోళనలో పడ్డారు. ఇక తమ పెళ్లి జరగదని సల్దా, ప్యాటర్‌సన్‌లు నిరాశచెందారు. కానీ, విమాన సిబ్బంది ఒకరి సాయంతో మరో ఫ్లైట్‌లో టికెట్ బుక్ చేసుకుని బయల్దేరారు..కాగా, పెళ్లి దుస్తుల్లో ఉన్న ఆ జంటను చూసిన..పైలట్..మీరు ఇక్కడే పెళ్లి చేసుకోవచ్చుకదా..! అంటూ సరదాగా జోక్ చేశారు. దానికి ఆ జంట వెంటనే ఒప్పుకుని విమానంలో పెళ్లికి సిద్ధమయ్యారు. దాంతో విమాన సిబ్బంది కూడా పెళ్లి వేడుకకు తగ్గట్టుగా టాయిలెట్ పేపర్‌తో ఫ్లైట్‌లో కొద్దిగా డెకరేషన్ కూడా చేశారు. ప్రయాణికుల్లో ఒకరు ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ ఆ జంట ఫోటోలను తీయడానికి ముందుకొచ్చాడు. అలా వారి పెళ్లి గాలిలో ప్రయాణిస్తోన్న విమానంలో జరిగిపోయింది. ఇక ఈ జంట పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ మొత్తం కథనాన్ని పోస్ట్ చేసింది సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్. ఆ ఫోస్టు వైరల్ అయింది. ఈ జంట కథను ఎవరూ మరిచిపోలేరంటూ కామెంట్ చేస్తున్న నెటిజన్లు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..